క్రీడాభూమి

ప్రో కబడ్డీ సీజన్ లీగ్ త్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 2: ప్రో కబడ్డీ లీగ్ నాలుగవ రోజు జరిగిన పోటీలో తెలుగు టైటాన్స్ జట్టు ఓటమి చవిచూసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన తెలుగు టైటాన్స్ జట్టు ఈ మ్యాచ్‌లో ఒక్కసారిగా సంయమనం కోల్పోయి 17-25 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో చిత్తు అయింది. దీంతో విశాఖలో జరిగిన పోటీల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో మిశ్రమ ఫలితాలు సాధించింది. ఇక్కడి పోర్టు రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విరామ సమయానికి రెండు జట్లు 9 పాయింట్లు సాధించి సమఉజ్జీగా ఉన్నాయి. అయితే ద్వితీయార్థం 13-10 పాయింట్ల ఆధిక్యతలోకి వచ్చిన టైటాన్స్ జట్టు డిఫెన్స్, అఫెన్స్ రెండింటిలోను వైఫల్యం చెందడంతో బెంగాల్ 8 పాయింట్ల తేడాతో గెలుపొందింది. బెంగాల్ జట్టులో సర్వీసెస్ రైడర్ నితిన్ తోమర్ రైడింగ్‌లో చక్కని ఆటను ప్రదర్శించి 6 పాయింట్లు, మహేంద్రరాజ్‌ఫుత్ 5 పాయింట్లు సాధించగా, గిరీష్ మారుతీ, నిలేష్ షిండే అద్భుతమైన డిఫెన్స్‌తో జట్టును గెలిపించారు. తెలుగు టైటాన్స్ జట్టు రైడింగ్‌లో రోహిత్‌బలియాన్ 4, రాహుల్ చౌదరి 3, మీరాజ్‌షేక్ 2 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో రైడింగ్‌లో రాణించిన నితిన్‌తోమర్ బెస్ట్ రైడర్‌గా, గిరీష్ మారుతీ బెస్ట్ డిఫెండర్‌గా అవార్డులందుకున్నారు.

మహిళల క్రికెట్
ఆసీస్ చేతిలో భారత్ చిత్తు
కాన్‌బెరా, ఫిబ్రవరి 2: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మంగళవారం జరిగిన తొలి వనే్డలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు 101 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. టి-20 సిరీస్‌లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా మహిళలు వనే్డ సిరీస్‌లో శుభారంభం చేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 276 పరుగులు చేసింది. అలెక్స్ బ్లాక్‌వెల్ 114 పరుగులతో రాణించగా, ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ 90 పరుగులు సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్ 43 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షికా పాండే 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. 46.5 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వారిలో ఝూలన్ గోస్వామి (25), మిథాలీ రాజ్ (23) కొంత వరకూ మెరుగైన ఆటను ప్రదర్శించారు. మిగతా వారంతా విఫలం కావడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలిస్ పెర్రీ 10 ఓవర్లలో 45 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి, భారత్‌ను దారుణంగా దెబ్బతీసింది.