క్రీడాభూమి

పూనమ్ యాదవ్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 13: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ పూనమ్ యాదవ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణతో విజృంభించి, భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆమె బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన జింబాబ్వే 28.5 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌట్‌కాగా, నామమాత్రపు లక్ష్యాన్ని భారత్ తొమ్మిది ఓవర్లలో, కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. తొమ్మిది పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించి, గ్రూప్ ‘ఎ’ నుంచి క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌కు దూసుకెళ్లింది. చివరిదైన నాలుగో గ్రూప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే కేవలం 60 పరుగులకే ఆలౌటైంది. మేరీ ఆనే్న మసోదా 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతోపాటు ప్రిసియస్ మరాంజ్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగింది. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కాగా, కెరీర్‌లోనూ అత్యుత్తమంగా బౌల్ చేసిన పూనమ్ యాదవ్ 19 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చింది. ఆమె స్పిన్ మాయకు కుదేలైన జింబాబ్వే ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 28.5 ఓవర్లలో ఆరు పదుల స్కోరుకే కుప్పకూలింది.
వరుసగా మూడు విజయాలు సాధించి, చివరి మ్యాచ్‌లోనూ అదే ఊపును కొనసాగించే పట్టుదలతో ఉన్న భారత్‌కు 61 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏమాత్రం సమస్య కాలేదు. వేదా కృష్ణమూర్తి 29 పరుగులు సాధించి అవుట్‌కాగా, మోనా మెష్రామ్ (21 నాటౌట్), హర్‌మన్‌ప్రీత్ కౌర్ (11 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరిన భారత్ తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో గెలిచింది.
థాయ్‌పై లంక గెలుపు
మరో మ్యాచ్‌లో థాయిలాండ్‌పై శ్రీలంక జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన థాయ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. నటాయా బుచాథమ్ 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇషానీ లుకుసురియాగే 15 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లంక 34.4 ఓవర్లలో మూడు వికెట్లకు 123 పరుగులు సాధించి, చివరి గ్రూప్ మ్యాచ్‌ని విజయంతో ముగించింది. చామరి పొల్గంపొలా 49 పరుగులతో రాణించి, లంక విజయంలో తన వంతు పాత్ర పోషించింది.
గ్రూప్ ‘బి’లో..
గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో పపువా న్యూ గునియాపై దక్షిణాఫ్రికా, స్కాట్‌లాండ్‌పై పాకిస్తాన్ జట్లు విజయాలను నమోదు చేశాయి. పపువా జట్టు 32.4 ఓవర్లలో 76 పరుగులకు ఆలౌట్‌కాగా, దక్షిణాఫ్రికా ఈ లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో, ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా చేరుకొని, పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. మరో మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ 39.1 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ 27.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టంతో 94 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.
సూపర్ సిక్స్‌కు చేరిన జట్లు
గ్రూప్ ‘ఎ’: భారత్, శ్రీలంక, ఐర్లాండ్ (నిష్క్రమించిన జట్లు జింబాబ్వే, థాయిలాండ్).
గ్రూప్ ‘బి’: దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ (గ్రూప్ దశ నుంచే వెనుదిరిగిన జట్లు స్కాట్‌లాండ్, పపువా న్యూ గునియా).