క్రీడాభూమి

ప్రతిఘటన అంటే ఇదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారత్‌లో పర్యటిస్తూ ఒక జట్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ వంద కంటే ఎక్కువ ఓవర్లు బ్యాట్ చేయ డం 2012 తర్వాత ఇదే మొదటిసారి. 2012 నాగపూర్ టెస్టు లో చివరిసారి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 145.5, రెం డో ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లు ఆడింది. ఇప్పుడు ముష్ఫికర్ ర హీం నాయకత్వంలోని బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5, రెండో ఇన్నింగ్స్‌లో 103.3 ఓవర్లు బ్యాటింగ్ చేసిం ది. మొ త్తం మీద భారత్‌లో పర్యటించినప్పుడు ఒక జట్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ వంద కంటే ఎక్కువ ఓవర్లు బ్యాట్ చేయడం ఇది 24వసారి. నాలుగో ఇన్నింగ్స్‌లో 250 పరుగులు సాధించిన బంగ్లాదేశ్, 2000 తర్వాత ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా గుర్తింపు సంపాదించింది.
భారత్‌లో టెస్టు ఆడుతూ, నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ 200 పరుగుల మైలురాయిని దాటిన తర్వాత ఒక జట్టు ఆరో వికెట్ కోల్పోవడం 2005 తర్వాత ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్ ఈ ఘనతను సాధించింది. మొత్తం మీద భారత్‌లో విదేశీ జట్లు ఈ విధంగా, నాలుగో ఇన్నింగ్స్‌లో 200లకుపైగా పరుగులు చేసిన తర్వాత ఆరో వికెట్ చేజార్చుకోవడం ఇది కేవలం ఆరోసారి. దీనిని బట్టి, బంగ్లాదేశ్ ప్రతిఘటన ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు.

ఓటమి లేకుండా 19..
హైదరాబాద్: భారత జట్టు ఓటమి అనేది లేకుండా 19 టెస్టులను పూర్తి చేసింది. చివరిసారి టీమిండియా ఒక టెస్టును 2015 ఆగస్టులో ఓడింది. శ్రీలంకతో గాలేలో జరిగిన ఆ మ్యాచ్‌ని 63 పరుగుల తేడాతో కోల్పోయింది. ఆతర్వాత ఇప్పటి వరకూ ఒక్క టెస్టులోనూ పరాజయాన్ని చవిచూడలేదు. కాగా, ఈ సీజన్‌లో టీమిండియా ఆడిన తొమ్మిది టెస్టుల్లో ఇది ఎనిమిదో విజయం. ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఒక టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో అశ్విన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య 50కి చేరింది. భారత టెస్టు క్రికెట్‌లో, నాలుగో ఇన్నింగ్స్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బిషన్ సింగ్ బేడీ, అనిల్ కుంబ్లే సరసన అశ్విన్ చోటు దక్కించుకున్నాడు.

చిత్రం..ముష్ఫికర్‌ను అవుట్ చేసిన అశ్విన్‌కు అభినందనలు