క్రీడాభూమి

టెస్టు భారత్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టును భారత్ 208 పరుగుల తేడాతో గెల్చుకుంది. అయితే, తన స్థాయితో పోలిస్తే, ఎన్నో రెట్లు ఎక్కువగా శ్రమించి, చివరి వరకూ పోరాడిన ‘పసికూన’ బంగ్లాదేశ్ ఈ టెస్టును కోల్పోయినప్పటికీ అందరి ప్రశంసలు అందుకుంది. టీమిండియాను భారత్‌లో ఎదుర్కొని, మ్యాచ్‌ని చివరి రోజు వరకూ దొర్లించడమే బంగ్లాదేశ్ ప్రతిభకు నిదర్శనం. అసాధ్యంగా కనిపిస్తున్న 459 పరుగుల లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తుండగా, దానిని ఛేదించే ప్రయత్నం కంటే మ్యాచ్‌ని డ్రాగా ముగించడానికి శ్రమించడమే మేలన్న రీతిలో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 103 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన సోమవారం ఉదయం ఆటను కొనసాగించి, మరో మూడు పరుగులు జత కలిసిన తర్వాత షకీబ్ అల్ హసన్ వికెట్‌ను కోల్పోయింది. అతను 50 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 22 పరగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చటేశ్వర్ పుజారా చక్కటి క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. కెప్టెన్ ముష్ఫికర్ రహీం 44 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23 డనరగరమర ఉధించి, అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. సబ్బీర్ రహ్మాన్ (23) పరుగులకే వెనుదిరగ్గా, భారత బౌలింగ్‌కు ఎదురునిలిచి, 200 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న మహమ్మదుల్లా 149 బంతులు ఎదుర్కొని 64 పరుగులు సాధించాడు. ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ క్యాచ్ పట్టగా అవుటైన అతని స్కోరులో ఏడు ఫోర్లు ఉన్నాయి. మెహదీ హసన్ మీర్జా 61 బంతుల్లో 23 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఒక షాట్‌కు ప్రయత్నించి, దారుణంగా బీటయ్యాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. తైజుల్ ఇస్లాం (6), తస్కిన్ అహ్మద్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. మొత్తం మీద 100.3 ఓవర్లలో 250 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌటైంది. కమ్రుల్ ఇస్లాం రబ్బీ మూడు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్, రవీంద్ర జడేజా చెరి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇశాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభించింది.

* విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ వరుసగా ఆరో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియాకు నాయకత్వం వహించిన వారిలో ఎక్కువ సంఖ్యలో వరుస సిరీస్‌లను సాధించిన ఘనత కోహ్లీకి దక్కింది. 2008-2010 మధ్యకాలంలో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్ వరుసగా ఐదు సిరీస్‌ల్లో నెగ్గితే, ఇప్పుడు ఆ రికార్డును కోహ్లీ కెప్టెన్సీలో అధిగమించింది. అతని సామర్థ్యంలో భారత్ 2015లో శ్రీలంక టూర్‌కు వెళ్లి, అక్కడ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అనంతరం వెస్టిండీస్‌లోనూ సిరీస్‌ను సాధించింది. ఆతర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై విజయాలు నమోదు చేసింది. ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే సిరీస్‌లో ఇదే ఒరవడిని కొనసాగిస్తుందో లేదో చూడాలి.
* కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు పరాజయం లేకుండా 19 టెస్టుల ప్రస్థానాన్ని పూర్తి చేసింది. కెప్టెన్‌గా సునీల్ గవాస్కర్ 1976-1980 మధ్యకాలంలో 18, కపిల్ దేవ్ 1985-1987 మధ్య 17 టెస్టులు ఓటమి లేకుండా పూర్తి చేశారు. ఓటమి లేకుండా అత్యధిక టెస్టుల్లో భారత జట్టును నడిపించిన రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు.
* కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 23 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించిన కోహ్లీ 15వ విజయాన్ని అందుకున్నాడు. ఇనే్న టెస్టుల్లో అత్యధిక విజయాలను సాధించిన కెప్టెన్‌గా స్టీవ్ వా రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయి వద్ద అతను 17 విజయాలను నమోవదు చేయగా, రికీ పాంటింగ్, మైఖేల్ వాన్‌తో కలిసి కోహ్లీ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.