క్రీడాభూమి

జంషెడ్పూర్ కోర్టులో ఆరోన్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంషెడ్పూర్, ఫిబ్రవరి 2: భారత క్రికెటర్లు ఒకరి తర్వాత మరొకరిగా ఓ ఇంటవారవుతున్నారు. ఇటీవలే హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ పెళ్లిళ్లు చేసుకోగా, ఆ జాబితాలో ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ కూడా చేరాడు. స్థానిక కోర్టులో తన చిన్ననాటి స్నేహితురాలు రాగిణిని అతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ గురువారం ఇక్కడి చర్చిలో వారి మత విశ్వాసాల ప్రకారం పెళ్లి జరుగుతుందని సమాచారం. ఆరోన్, రాగిణి లయోలా స్కూల్‌లో కలిసి చదువున్నారు. కాగా, వివాహం కారణంగా, బుధవారం నుంచి బెంగళూరులో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ముంబయితో ఢీకొనే జార్ఖండ్ జట్టు తరఫున ఆరోన్ ఆడడం లేదు. హర్భజన్, రోహిత్ కూడా తమతమ చిన్ననాటి స్నేహితురాళ్లనే వివాహం చేసుకోగా, మోడెల్ హాజెల్ కీత్‌తో గత ఏడాది నవంబర్‌లో యువరాజ్ సింగ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. అతని వివాహం కూడా ఈనెల జరుగుతుందని తెలుస్తోంది.

ఒలింపిక్స్‌కు మెస్సీ దూరం!

బ్యూనస్ ఎయిర్స్, ఫిబ్రవరి 2: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఈఏడాది ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. మెస్సీకి విశ్రాంతి అత్యవసరమని, అందుకే అతను రియో ఒలింపిక్స్‌కు హాజరుకావడం లేదని అతని వ్యక్తిగత కోచ్ గెరార్డో మార్టినో తెలిపాడు. అమెరికాలో జరిగే సెంటినియల్ కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అతను ఆడతాడని అర్జెంటీనా రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. అయితే, బ్రెజిల్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనడని తెలిపాడు. సెంటినియల్ టోర్నీలో ఆడి, ఆతర్వాత తగినంత విశ్రాంతి లేకుండానే ఒలింపిక్స్‌లో పాల్గొనడం మెస్సీకి అసాధ్యమవుతుందని అన్నాడు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరిగే ప్రపంచ కప్ క్వాలియఫయర్స్‌కు అతను సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నాడు. బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మెస్సీ వివిధ టోర్నీల్లో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నాడని వివరించాడు.
అర్జెంటీనా ఇది వరకే ప్రకటించిన ఒలింపిక్స్ జట్టులో మెస్సీకి స్థానం దక్కింది. ఆ జట్టులో మెస్సీసహా కేవలం ముగ్గురు మాత్రమే 23 ఏళ్లకు పైబడిన వారు. మిగతా ఆటగాళ్లంతా తక్కువ వయసున్న వారే. 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన అర్జెంటీనా జట్టుకు మెస్సీ నాయకత్వం వహించాడు.