క్రీడాభూమి

సత్తా చాటిన హోల్డెన్, బర్ట్‌లెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, ఫిబ్రవరి 14: భారత అండర్-19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు క్రికెట్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (విసిఎఎస్)లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టు కెప్టెన్ మ్యాక్స్ హోల్డెన్ (170)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ జార్జ్ బర్ట్‌లెట్ (179) అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుకున్నారు. వీరికి తోడు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డెల్రే రౌలిన్స్ 70 పరుగుల అజేయ వ్యక్తిగత స్కోరుతో రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 501 పరుగుల భారీ స్కోరు వద్ద మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో కనిష్క్ సేథ్ 2 వికెట్లు, ఎస్.జోసఫ్, డిఎస్.ఫెరారియో, జాంటీ సిద్ధూ ఒక్కో వికెట్ చొప్పున రాబట్టారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 23 పరుగులకే నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ ఆర్‌ఎస్.కన్నుమ్మళ్ (13) వికెట్‌ను కోల్పోయింది. అయితే అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సౌరభ్ సింగ్ నుంచి చక్కని సహకారం లభించడంతో స్కోరు బోర్డును ముందుకు నడిపిన ఓపెనర్ అభిషేక్ గోస్వామి 66 పరుగులు సాధించి నిష్క్రమించాడు. ఆ తర్వాత సౌరభ్ సింగ్ (53), కెప్టెన్ జాంటీ సిద్ధూ (23) అజేయంగా నిలవడంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్లు నష్టపోయి 156 పరుగులు సాధించింది.

చిత్రం..మ్యాక్స్ హోల్డెన్ (170)