క్రీడాభూమి

అగ్రస్థానానికి చేరువైన మిథాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 14: ప్రపంచ మహిళల వనే్డ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానానికి చేరువైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మంగళవారం తాజాగా విడుదల చేసిన ఉత్తమ బ్యాటర్ల జాబితాలో ఆమె మరో అడుగు ముందుకేసి రెండవ స్థానానికి చేరుకోగా, భారత ఓపెనర్ దీప్తి శర్మ ఏకంగా 17 స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకుకు, మరో ఓపెనర్ తిరుష్ కామిని 11 స్థానాలను మెరుగుపర్చుకుని 41వ ర్యాంకుకు చేరుకున్నారు. వీరిద్దరికీ కెరీర్‌లో ఇవే ఉత్తమ ర్యాంకులు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ రుమానా అహ్మద్ నాలుగు స్థానాలను మెరుగుపర్చుకుని 31వ ర్యాంకుకు చేరుకోగా, పాకిస్తాన్‌కు చెందిన నయిన్ అబిదీ రెండు ర్యాంకులను మెరుగుపర్చుకుని 26వ స్థానానికి చేరుకుంది. ఉత్తమ బౌలర్ల జాబితాలో సనా మిర్ రెండు ర్యాంకులను మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా, భారత ఎడమచేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిస్త్ మూడు ర్యాంకులను మెరుగుపర్చుకుని 11వ స్థానానికి, దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ సన్ లస్ ఆరు ర్యాంకులను మెరుగుపర్చుకుని 28వ స్థానానికి, రుమానా అహ్మద్ నాలుగు ర్యాంకులను మెరుగుపర్చుకుని 29వ స్థానానికి, శ్రీలంక జట్టు కెప్టెన్ ఇనోకా రణవీర ఐదు ర్యాంకులను మెరుగుపర్చుకుని 33వ స్థానానికి చేరుకున్నారు. కాగా, బ్యాటింగ్ ర్యాంకింగుల్లో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 12వ ర్యాంకుకు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ వాన్ నియెకెర్క్ బౌలింగ్ ర్యాంకింగుల్లో కూడా రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 15వ ర్యాంకుకు చేరుకుంది.