క్రీడాభూమి

బౌలింగ్‌లో డాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో, ఫిబ్రవరి 14: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా టీమిండియా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బౌలింగ్‌లో డాన్‌బ్రాడ్‌మన్‌తో పోల్చడమే కాదు, రాబోయే భారత పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు అధిగమించాల్సిన ఆటగాడు అతనేనని కూడా అభిప్రాయ పడ్డాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రశాంతంగా ఉండాలని, అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మార్గాలను అనే్వషించాలని స్టీవ్ వా అన్నాడు. పుణెలో ఈ నెల 23నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుతో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ‘అశ్విన్ బౌలింగ్‌లో బ్రాడ్‌మన్‌లాంటి వాడు. అతను బౌలింగ్ తీరు అద్భుతం. మేము అధిగమించాల్సిన ఆటగాడు అతనేనని నేను అనుకుంటున్నాను. అశ్విన్ బౌలింగ్‌ను అదిగమిం మార్గాలవైపు ఆస్ట్రేలియన్లు చూడాలి. వాళ్లు ఆ పని చేయగలిగితే మనకు చాన్స్ ఉంటుంది. ఒత్తిడిలో ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఉండాలి’ అని స్టీవ్ వా అన్నాడు. అశ్విన్‌పై వా ప్రశంసల వర్షం కురిపిస్తూ, అతను ఇప్పుడు రాణిస్తున్న తీరు చూస్తే ఎన్నో రికార్డులు బద్దలు చేస్తాడు. అతని గణాంకాలు కళ్లు చెదిరిపోయే విధంగా ఉన్నాయని అభిప్రాయ పడ్డాడు.
కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఇప్పుడు చాలా చక్కగా రాణిస్తోందన్న స్టీవ్ వా ఆస్ట్రేలియా జట్టుకు ఇది చాలా క్లిష్టమైన సిరీసేనని అభిప్రాయ పడ్డాడు. సొంతగడ్డపై వారిని ఓడించడం కష్టమని, ఈ విషయం చాలా సందర్భాల్లో రుజువయిందని కూడా అన్నాడు. అయితే ఆస్ట్రేలియా జట్టు రాబోయే సిరీస్‌లో అన్ని టెస్టు మ్యాచ్‌లు ఓడిపోందన్న సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలతో స్టీవ్ వా విభేదించాడు. ‘ఆస్ట్రేలియా గురించి అలా వ్యాఖ్యానించడం అవివేకం. ఆ జట్టు తప్పకుండా ఆశ్చర్య పరుస్తుంది. ఆ జట్టులో మ్యాచ్‌విన్నర్లున్నారు. గంగూలీ ఆశావాది కావచ్చు. అయితే ఒక్కటిమాత్రం నిజం. మా వాళ్లు అన్ని మ్యాచ్‌లు పోగొట్టుకొని మాత్రం వెళ్లరు’ అని వా అన్నాడు. అయితే ఇటీవలి కాలంలో విదేశీ పర్యటనల్లో ఆసీస్ జట్టు ఆటతీరు కాస్త నిరాశాజనకంగా ఉన్న మాట నిజమే అయినప్పటికీ దానికి కారణం మాత్రం తనకు తెలియదని అన్నాడు. కాగా, ఇంగ్లాండ్‌కన్నా ఆసీస్ మెరుగ్గానే రాణిస్తుందని వా అభిప్రాయ పడ్డాడు.

చిత్రాలు..రవిచంద్రన్ అశ్విన్* స్టీవ్ వా