క్రీడాభూమి

కంగారూలతో తొలి రెండు టెస్టులకు..కూనలను ఓడించిన జట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: పసికూన బంగ్లాదేశ్‌పై సోమవారం హైదరాబాద్‌లో ఘనవిజయం సాధించి సత్తా చాటుకున్న భారత క్రికెట్ జట్టే ఈ నెల 23వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను ఆడనుంది. అయితే లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయంతో బాధపడుతుండటంతో అతనికి ఈ జట్టులో చోటు కల్పించలేదు. ఈ ఒక్క మార్పు మినహా బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన భారత జట్టు సభ్యులనే కంగారూలతో తొలి రెండు టెస్టుల్లో ఆడేందుకు ఎంపిక చేశారు. మోకాలి గాయంతో బాధపడుతున్న అమిత్ మిశ్రా బంగ్లాదేశ్‌తో టెస్టుకు బరిలోకి దిగకుండా పెవిలియన్‌లో కూర్చోవడంతో అతనికి బదులుగా కుల్దీప్ యాదవ్‌కు సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే అమిత్ మిశ్రా ఇప్పటికీ గాయం నుంచి కోలుకోలేకపోవడంతో ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో తలపడేందుకు 16 మంది సభ్యులతో ఎంపిక చేసిన భారత జట్టులో సెలెక్టర్లు కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించారు. ఆసీస్‌తో నాలుగు టెస్టుల్లో తొలి మ్యాచ్ ఈ నెల 23 నుంచి పుణెలోనూ, రెండో మ్యాచ్ మార్చి 4వ తేదీ నుంచి బెంగళూరులోనూ, మూడో మ్యాచ్ మార్చి 16వ తేదీ నుంచి రాంచీలోనూ, చివరి మ్యాచ్ మార్చి 25 నుంచి ధర్మశాలలోనూ ప్రారంభమవుతాయి. తండ్రి మృతి చెందడంతో జట్టుకు అందుబాటులో లేకుండా పోవడానికి ముందు రిహాబిలిటేషన్‌కు వెళ్లిన పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి కూడా ఈ జట్టులో చోటు లభించలేదు. షమీ మోకాలికి తగిలిన గాయం కెరీర్‌కే ప్రమాదకరంగా పరిణమించడంతో అతను శస్తచ్రికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కంగారూలతో తలపడేందుకు ఎంపిక చేసిన భారత జట్టులో సెలెక్టర్లు ఇంతకు మించి మరేమీ మార్పులు చేయలేదు. ఆసీస్‌తో తలపడే భారత జట్టులో అజింక్యా రహానే, జయంత్ యాదవ్, హార్దిక్ పాండ్యా స్థానాలు పదిలంగానే ఉన్నాయి. మురళీ విజయ్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఆటోమ్యాటిక్‌గా ఎంపిక చేసిన సెలెక్టర్లు పేసర్ల త్రయం ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్‌లకు కూడా ఈ జట్టులో చోటు కల్పించారు. వికెట్‌కీపర్ స్థానానికి ప్రథమ ప్రాధాన్యతగా ఉన్న వృద్ధిమాన్ సాహాను కొనసాగించారు. అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో టీమిండియా ఓపెనర్ అభినవ్ ముకుంద్ బరిలోకి దిగకపోయినప్పటికీ కంగారూలతో తలపడే భారత జట్టులో సెలెక్టర్లు అతనికి కూడా చోటు కల్పించారు. వరుసగా 19 టెస్టు మ్యాచ్‌లలో విజయం సాధించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పుడు కంగారూలతో స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.
ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో
తలపడే భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా.