క్రీడాభూమి

చెలరేగిన జగ్గీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: ముస్తాక్ అలీ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో బుధవారం సౌత్‌జోన్‌ను ఢీకొన్న ఈస్ట్‌జోన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇశాంక్ జగ్గీ విజృంభణ ఈస్ట్‌ను విజయపథంలో నడిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌జోన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 178 పరుగులు సాధించింది. ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 72 పరుగులు), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ వినయ్ కుమార్ (47 బంతుల్లో 68 పరుగులు) రాణించినప్పటికీ గట్టిపోటీనిచ్చే స్థాయిని సౌత్ అందుకోలేకపోయింది. ఈస్ట్ కెప్టెన్ మనోజ్ తివారీ 31 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఈస్ట్ 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఇశాంక్ జగ్గీ 51 బంతులు ఎదుర్కొని 01 పరుగులు చేసి, బాసిల్ థంపీ బౌలింగ్‌లో తన్మయ్ అగర్వాల్‌కు దొరికిపోయాడు. అతని స్కోరులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ శ్రీవత్స్ గోస్వామి (25), సౌరభ్ తివారీ (33) కూడా ఈస్ట్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
నార్త్‌కు సెంట్రల్ షాక్
స్టార్ ఆటగాళ్లతో కూడిన నార్త్ జోన్‌కు సెంట్రల్ జోన్ షాకిచ్చింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సెంట్రల్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వికెట్‌కీపర్, కెప్టెన్ నమన్ ఓఝా 48 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్‌లో మహేష్ రావత్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మన్‌ప్రీత్ గోనీ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా 26 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు. కెప్టెన్ హర్భజన్ సింగ్‌కు రెండు వికెట్లు లభించాయి.
సెంట్రల్‌ను ఓడించి, తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు 168 పరుగులు చేయాల్సిన నార్త్ తన లక్ష్య సాధనలో తడబడింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (37), వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (25), యువరాజ్ సింగ్ (33) వంటి మేటి స్టార్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో నార్త్‌కు ఓటమి తప్పలేదు. చివరిలో మన్‌ప్రీత్ గోనీ కేవలం 9 బంతుల్లోనే 23 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే ఎక్కువ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.