క్రీడాభూమి

మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 15: మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్ స్థాయిలో మొదటి మ్యాచ్‌ని దక్షిణాఫ్రికాపై గెల్చుకున్న భారత్ శుభారంభం చేసింది. మిథాలీ రాజ్, మోనా మెష్రామ్ అర్ధ శతకాలతో రాణించడంతో 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 205 పరుగులు సాధించిన భారత్ ఆతర్వాత దక్షిణాఫ్రికాను 46.4 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ చేసి, 49 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. శిఖా పండే 34 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో ముఖ్య భూమిక పోషించింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ పరుగుల కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. అయితే, ఓపెనర్ మోనా మెష్రామ్, మిడిల్ ఆర్డర్‌లో సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ చక్కటి ప్రతిభ కనబరచి, అర్ధ శతకాలు సాధించడంతో భారత్ స్కోరు రెండు వందల పరుగుల మైలురాయిని దాటింది. మోనా 85 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55, మిథాలీ 85 బంతుల్లో, 10 ఫోర్లతో 64 చొప్పున పరుగులు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజానే కపో 23 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. అయబోంగా ఖకా 44 పరుగులకు రెండు వికెట్లు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. త్రిష చెట్టి 81 బంతుల్లో 52 పరుగులు సాధించడాన్ని మినహాయిస్తే, ఆ జట్టులోని బ్యాట్స్‌విమెన్ ఎవరూ చెప్పుకోదగ్గ పోరాటాన్ని కొనసాగించలేకపోయారు. పరుగుల వేట4లో తడబడిన దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. గ్రూప్ దశలో ఒక్క పరాజయం కూడా సూపర్ సిక్స్‌కు దూసుకొచ్చిన భారత్ అదే ఊపును కొనసాగిస్తున్నది. పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఓడించి సత్తా చాటింది.
పాక్‌పై లంక గెలుపు
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో గెల్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. నహిదా ఖాన్ 64 పరుగులతో రాణించగా, ఇనోకా రణవీర 33 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఆతర్వాత బ్యాటింగ్ చేసిన లంక 47.4 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకొని 216 పరుగులు సాధించింది. ఇషానీ లొకుసురియాగే అజేయంగా 65 పరుగులతో రంకను విజయపథంలో నడిపింది. పాక్ బౌలర్ గులాం ఫాతిమా 29 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది.
మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల ఆధిక్యంతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 47.1 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత బంగ్లాదేశ్ 39.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

చిత్రం..భారత టాప్ స్కోరర్ మిథాలీ రాజ్ (64)