క్రీడాభూమి

నెట్ ప్రాక్టీస్‌లో ఆసీస్ బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: భారత్‌తో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కసరత్తు చేస్తున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, ఇతర సభ్యులు బుధవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. సోమవారం రాత్రి ముంబయి చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు ఒక రోజు విరామం తీసుకున్న తర్వాత, బుధవారం నెట్స్‌కు హాజరయ్యారు. కెప్టెన్ స్మిత్‌తోపాటు, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, ఉస్మాన్ ఖాజా నెట్స్‌లో ఎక్కువసేపు ఉన్నారు. కొంత మంది ఆటగాళ్లు స్లిప్స్‌లో క్యాచ్‌ల ప్రాక్టీస్‌లో చాలాసేపు నిమగ్నమయ్యారు. మరికొంత మంది బ్యాట్స్‌మెన్ వికెట్ల మధ్య పరుగులు తీయడానికి ప్రాధాన్యమిచ్చారు. భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయన్న ఉద్దేశంతో నెట్స్‌లో బ్యాటింగ్ చేసిన ప్రతి ఒక్కరూ స్థానిక స్పిన్నర్ల నుంచి బంతులు ఎదుర్కోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
కోహ్లీకి స్టార్క్ నుంచి సవాళ్లు: హస్సీ
కనీవినీ రీతిలో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ నుంచి సవాళ్లు తప్పవని ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ జోస్యం చెప్పాడు. బుధవారం అతను పిటిఐతో మాట్లాడుతూ కోహ్లీ అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడని కితాబునిచ్చాడు. అయితే, అతనికి స్టార్క్ నుంచి సమస్యలు తప్పవని వ్యాఖ్యానించాడు. స్టార్క్ కూడా గొప్ప ఫామ్‌లో ఉన్నాడనే విషయాన్ని మరచిపోకూడదని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత్‌లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడేందుకు కష్టపడాల్సి ఉంటుందన్నాడు. దీని కోసం కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అన్ని విధాలుగా సిద్ధం కావాలని హితవు పలికాడు.