క్రీడాభూమి

హైదరాబాద్‌లో ఐపిఎల్ తొలి మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఫిబ్రవరి 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2017 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) బుధవారం విడుదల చేసింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌తోపాటు ఫైనల్ కూడా హైదరాబాద్‌లోనే జరగనుండడం విశేషం. ఏప్రిల్ 5న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిఫెం డింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రన్నరప్ రాయల్ చా లెంజర్స్ బెంగళూరు జట్లు ఢీ కొంటాయ. ఇదే స్టేడియంలో మే 21న ఫైనల్ జరుగుతుంది. 47 రోజుల పాటు 10 వేదికల్లో ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని బిసిసిఐ తన ప్రకటనలో పే ర్కొంది. ప్రతి జట్టూ 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. వీటిలో సగం మ్యాచ్‌లను సొంత మైదానంలో ఆడుతుంది. 2011 తర్వా త ఇండోర్‌లో మళ్లీ మ్యాచ్‌లు జరగనున్నాయ. కాగా, ఎలిమినేట ర్, క్వాలిఫయర్ మ్యాచ్‌ల కేంద్రాలను తర్వాత ప్రకటిస్తారు. కిం గ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆడాల్సిన హోం గ్రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లకు మొహాలీ వేదికవుతుంది. ఇలావుంటే, రైజింగ్ పుణే సూపర్ జెయంట్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ని ముంబయ ఇండి యన్స్‌తో ఏప్రిల్ 6న ఆడుతుంది. షారుఖ్ ఖాన్ జయమానిగా ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 7న గుజరాత్ ల యన్స్‌ను ఢీ కొంటుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మొదటి మ్యాచ్‌ని ఏప్రి ల్ 8న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, ఆయా హోం గ్రౌండ్స్‌తో పాటు ఇండోర్, కాన్పూర్ పట్టణాల్లో కూడా మ్యాచ్‌లు ఉంటాయ.