క్రీడాభూమి

బోల్ట్, బైల్స్‌కు లారెస్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో, ఫిబ్రవరి 15: ‘స్ప్రింట్ వీరుడు’ ఉసేన్ బోల్ట్, ‘జిమ్నాస్టిక్స్ క్వీన్’ సిమోన్ బైల్స్ ప్రతిష్ఠాత్మక లారెస్ ప్రపంచ అవార్డులు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, అమెరికా ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ తదితరుల నుంచి బోల్ట్‌కు గట్టిపోటీ ఎదురైంది. అయితే, వరుసగా మూడు ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకాలను కొల్లగొట్టి తనకు తిరుగులేదని నిరూపించుకున్న బోల్ట్‌కే అవార్డు దక్కింది. క్రీడల్లో ‘ఆస్కార్’తో పోల్చదగిన ఈ అవార్డును అతను గెల్చుకోవడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు 2009, 2010, 2013 సంవత్సరాల్లో బోల్ట్‌ను లారెస్ అవార్డు వరించింది. దీనిని ఎక్కువ పర్యాయాలు స్వీకరించిన అథ్లెట్‌గా అతను రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ (టెన్నిస్), కెల్లీ స్లాటర్ (సర్ఫింగ్)తో కలిసి రికార్డును పంచుకుంటున్నాడు. ‘లెజెండరీ అథ్లెట్ మైఖేల్ జాన్సన్ నుంచి అవార్డును స్వీకరించిన బోల్ట్ ‘నీ రికార్డును బద్దలు చేసినందుకు క్షమించు’ అంటూ చమత్కరించాడు.
రియో ఒలింపిక్స్‌లో తిరుగులేని ప్రతిభ కనబరచి, నాలుగు స్వర్ణాలతోపాటు ఒక కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకున్న బైల్స్‌కు గట్టిపోటీ ఎదురుకాలేదు. మహిళల అవార్డుకు సెరెనా విలియమ్స్ వంటి ఒకరిద్దరు రేసులో ఉన్నప్పటికీ, బైల్స్‌కు అవార్డు దక్కింది.
అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన ‘ఆల్‌టైమ్ గ్రేట్’ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును తీసుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఫెల్ప్స్ ఆతర్వాత మనసు మార్చుకొని రియో ఒలింపిక్స్‌లో పోటీపడి, ఐదు స్వర్ణ పతకాలను సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఫార్ములా వన్ చాంపియన్ నికో రోజ్‌బెర్గ్‌కు ‘బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. అవార్డులు ప్రదానోత్సవం కన్నుల వండువగా జరిగింది.

చిత్రం.. క్రీడా రంగంలోనే అత్యంత ప్రతిషాఠత్మకమైన లాఠెస్ ప్రపంచ అవార్డులతో ఉసేన్ బోల్ట్, సిమోన్ బైల్స్. దీనిని ‘క్రీడా ఆస్కార్’ గా పేర్కొంటారు