క్రీడాభూమి

మాయాంక్ హాఫ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: ముస్తాక్ అలీ అంతర్ మండల టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌ల్లో వెస్ట్‌జోన్‌పై సౌత్‌జోన్, నార్త్‌జోన్‌పై ఈస్ట్‌జోన్ విజయాలు నమోదు చేశాయి. ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ అర్ధ శతకంతో రాణించడంతో, వెస్ట్‌ను సౌత్ జోన్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. దీపక్ హూడా 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్, ఆదిత్య తారే చెరి 26 పరుగులు చేశారు. సౌత్ బౌలర్లలో చామా మిలింద్ 41 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. రాహిల్ షా, మురుగన్ అశ్విన్, విజయ్ శంకర్ తలా రెండేసి వికెట్లు సాధించారు.
విజయానికి 141 పరుగులు చేయాల్సి ఉండగా, ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన సౌత్ 48 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను విష్ణు వినోద్ (36) రూపంలో కోల్పోయింది. కెప్టెన్ విజయ్ శంకర్ మూడు బంతులు ఎదుర్కొని, రెండు పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడగా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ (17) అతనికి చక్కటి మద్దతునిచ్చాడు. మాయాంక్ 46 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 70 పరుగులు చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే సౌత్ స్కోరు 136 పరుగులకు చేరింది. పవన్ దేశ్‌పాండే (9), మురుగన్ అశ్విన్ (1) మరో వికెట్ కూలకుండా జట్టును లక్ష్యానికి చేర్చారు.
ఈస్ట్ చేతిలో నార్త్ చిత్తు
శిఖర్ ధావన్, గౌతం గంభీర్, ఉన్ముక్త్ చాంద్, యువరాజ్ సింగ్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్న నార్త్‌జోన్ గురువారం నాటి మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ చేతిలో, ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్త్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు సాధించింది. యువరాజ్ సింగ్ అత్యధికంగా 38 పరుగులు చేశాడు. చివరిలో ప్రదీప్ సంగ్వాన్ 21 పరుగులు చేయగా, శిఖర్ ధావన్, గౌతం గంభీర్, ఉన్ముక్త్ చాంద్ తలా 20 పరుగులు నమోదు చేశారు. ఈస్ట్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా 33 పరుగులకు మూడు వికెట్లు సాధించాడు. సయాన్ ఘోష్, ప్రీతం దాస్, అమిత్ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం, 160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఈస్ట్ మొదటి బంతిలోనే ఓపెనర్ శ్రీవత్స్ గోస్వామి వికెట్‌ను కోల్పోయింది. ఇశాంక్ జగ్గీ ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే, సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ మనోజ్ తివారీ (43 బంతుల్లో 75 పరుగులు)తో కలిసి ఓపెనర్ విరాట్ సింగ్ (48 బంతులోవ్ల 74 పరుగులు) ఈస్ట్‌కు విజయాన్ని సాధించిపెట్టాడు.

చిత్రం..మాయాంక్ అగర్వాల్ (70)