క్రీడాభూమి

బల పరీక్షకు ఆస్ట్రేలియా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 15: భారత్‌లో టీమిండియాను ఎదుర్కోవడం సులభసాధ్యం కాదని ఒకవైపు అంగీకరిస్తూనే మరోవైపు ప్రపంచ మేటి జట్టుగా వెలిగి, ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న ఆస్ట్రేలియా తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమైంది. భారత్ ‘ఎ’తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌ని తుది జట్టు కూర్పుపై నిర్ణయాలు తీసుకోవడానికి సరైన వేదికగా భావిస్తున్నది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య నాయకత్వంలోని భారత్ ‘ఎ’లో జాతీయ జట్టుకు పోటీపడుతున్న పలువురు యువ ఆటగాళ్లు ఉన్నారు. గుజరాత్ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాపైనా అద్భుతంగా ఆడడం ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు అతను ప్రయత్నించడం ఖాయం. హార్డ్ హిట్టర్‌గా పేరు సంపాదించిన రిషభ్ పంత్, భారత్ అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ టోర్నీలో వరుసగా నార్త్ జోన్, ఈస్ట్ జోన్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ ఆ టోర్నీని పక్కకుపెట్టి, మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో ఆడేందుకు దాదాపుగా లైన్ క్లియర్ చేసుకున్నారు. ముంబయికి చెందిన శ్రేయాస్ అయ్యర్, అఖిల్ హెర్వాద్కర్ కూడా బ్యాటింగ్‌లో సమర్థులుగా పేరుతెచ్చుకున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే కుల్దీప్ యాదవ్, అశోక్ దిండా, ఎడమచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీం, కృష్ణప్ప గౌతం తదితరులు ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ఎంత వరకు కట్టడి చేస్తారో చూడాలి. టెస్టు బౌలర్లను బరిలోకి దించకుండా ద్వితీయ శ్రేణి లైనప్‌తోనే భారత్ సరిపుచ్చుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే, టీమిండియాతో జరిగే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని, ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవసరమని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖాజా, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, గ్లేన్ మాక్స్‌వెల్ వంటి స్టార్ల ఆటను చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది.

చిత్రం..పిచ్ తీరును సునిశితంగా పరిశీలిస్తున్న భారత్ ‘ఎ’ కెప్టెన్ హార్దిక్ పాండ్య (ఎడమ)