క్రీడాభూమి

ఏప్రిల్ ఒకటిన జుల్పికర్‌తో విజేందర్ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తిన తర్వాత వరుస విజయాలు సాధించడమేగాక, ఇటీవలే డబ్ల్యుబిఓ ఆసియా పసిఫిక్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్ తన తర్వాతి ఫైట్‌లో జుల్పికర్ మైమైతియాలీతో తలపడతాడు. ఏప్రిల్ 1న జరిగే ఈ ఫైట్‌లో విజయం తనదేనని విజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఆసియా పసిఫిక్ డబ్ల్యుబిఓ టైటిల్ కోసం టాంజానియాకు చెందిన ఫ్రాన్సిస్ చెకాను ఓడించిన అతనికి ఈసారి చైనా బాక్సర్, డబ్ల్యుబిఓ ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్ జుల్పికర్ నుంచి తీవ్రమైన పోటీ తప్పకపోవచ్చు. ప్రస్తుతం విజేందర్ బ్రిటిష్ ట్రైనర్ లీ బియర్డ్ వద్ద మాంచెస్టర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.