క్రీడాభూమి

ఎనిమిది ప్రారంభోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఈసారి కొత్త ఒరవడికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శ్రీకారం చుట్టింది. ఎనిమిది జట్లు పోటీపడే 10వ ఐపిఎల్‌లో ఒక్కో జట్టు హోం గ్రౌండ్‌లో ఆడే తొలి మ్యాచ్‌లకు ముందు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. వీటి కోసం ప్రతిపాదనలను ఆహ్వానించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో నలుగురు సభ్యులతో కూడిన కొత్త కమిటీ పాలనా వ్యవహారాల బాధ్యతను స్వీకరించిన తర్వాత బిసిసిఐ పారదర్శకతపై దృష్టి కేంద్రీకరించింది. అందుకే, ప్రారంబోత్సవాలతోపాటు, ముగింపు కార్యక్రమ నిర్వహణకు బిడ్స్ వేసే కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎనిమిది కేంద్రాల్లో, ఎనిమిది ప్రారంభోత్సవాలను నిర్వహించడానికి ఆసక్తి, అర్హత గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఎంపికైన కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఐదు పని దినాల్లోగా మొత్తం అంచనా వ్యయంలో 35 శాతానికి ఎలాంటి షరతులు లేని బ్యాంక్ గ్యారంటీని ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేగాక, సదరు పార్టీ వార్షిక టర్నోవర్ 30 కోట్లకు తగ్గకుండా ఉండాలన్న నిబంధన విధించింది. కంపెనీ పాలక మండలిలోని వ్యక్తి లేదా వ్యక్తులు బిసిసిఐతో పరస్పర ప్రయోజనాలు కలిగి ఉండరాదని స్పష్టం చేసింది. వీరిలో ఎవరిపైనా క్రిమినల్ కేసులు ఉండకూడదని కూడా తేల్చిచెప్పింది. మారిషస్, బ్రిటిష్ వర్జిన్ ద్వీపాలుసహా సదరు కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థ ఏఏ ప్రాంతాల్లో, ఎలాంటి వ్యాపారాలను నిర్వహిస్తున్నదో వివరాలు సమర్పించాలని సూచించింది. మార్చి ఒకటో తేదీన ముంబయిలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో అన్ని వివరాలతో ప్రెజెంటేషన్ ఇవ్వాలని తెలిపింది.
ప్రారంభోత్సవ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతున్నదో వివరించడానికి ఒక్కో కంపెనీ లేదా కార్పొరేట్ సంస్థకు 45 నిమిషాలు కేటాయిస్తామని, అందులో వీడియో ప్రెజెంటేషన్‌ను ఇవ్వాలని కోరింది. ఎంపిక చేసిన సంస్థతో ఒప్పందాన్ని గురించి అదే రోజున ప్రకటిస్తామని పేర్కొంది. పాలనాధికారులుగా మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, ప్రముఖ చరిత్రకారుడు, కాలమిస్టు రామచంద్ర గుహ, ఐడిఎఫ్‌సి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి విక్రం లిమాయే బాధ్యతలు తీసుకున్న తర్వాత బిసిసిఐ చేపడుతున్న మొదటి భారీ కార్యక్రమం ఈనెల 20న జరిగే ఆటగాళ్ల వేలంకాగా, ప్రారంభోత్సవాల నిర్వహణ బాధ్యతను ఎంపిక చేసిన కంపెనీకి అప్పగించడం రెండోది.