క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు హారిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెహ్రాన్ (ఇరాన్), ఫిబ్రవరి 17: భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఇక్కడ జరుగుతున్న మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇంటర్నేషనల్ మాస్టర్ పద్మినీ రావత్ కూడా ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం విశేషం. దినారా సడుకసొవాతో తలపడిన హారిక చక్కటి ఎత్తుగడలతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. తన పావులతో అన్ని వైపుల నుంచి దాడులు ముమ్మరం చేసి, చివరికి దినారాకు ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితిని కల్పించింది. కాగా, పద్మిని తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న చైనా క్రీడాకారిణి జవో జూపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండో టైబ్రేకర్‌లో ఆమె తన ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.