క్రీడాభూమి

మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 17: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో గురువారం బంగ్లాదేశ్‌ను ఢీకొన్న భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ మోనా మెష్రామ్, కెప్టెన్ మిథాలీ రాజ్ అజేయ అర్ధ శతకాలతో రాణించి, భారత్ విజయాన్ని సులభతరం చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఫర్గానా హాక్ 50 పరుగులు చేయగా, షమీన్ అక్తర్ 35 పరుగులు సాధించింది. వీరిద్దరి పోరాటంతో బంగ్లాదేశ్ స్కోరు 150 పరుగుల మైలురాయిని దాటింది. మాన్సీ జోషి 25 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టింది. దేవిక్ వైద్య 17 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించింది. ఆతర్వాత, ఏమాత్రం కష్టంకాని లక్ష్యాన్ని భారత్ 33.5 ఓవర్లలో, కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ దీప్తి శర్మ ఒక పరుగు చేసి, ఖదీజా తుల్ కుబ్రా బౌలింగ్‌లో రిటర్న్‌క్యాచ్ ఇచ్చి అవుటైంది. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మిథాలీ రాజ్ సహకారంతో ఓపెనర్ మోనా ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయాన్ని అందించింది. 92 బంతులు ఎదుర్కొన్న ఆమె 78 పరుగులు (12 ఫోర్లు) సాధించింది. మిథాలీ 87 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 73 పరుగులు చేసింది.
శ్రీలంక చిత్తు
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తయింది. లంక మొదట బ్యాటింగ్‌కు దిగి, 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 142 పరుగులు చేసింది. 96 బంతుల్లో 48 పరుగులు చేసిన నిపుణి హన్సిక టాప్ స్కోరర్‌గా నిలవగా, హాసిని పెరెరా 26 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్ సనే లుస్ 40 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. డేన్ వాన్ నికెర్క్ 14 పరుగులకే రెండు వికెట్లు సాధించింది. అనంతరం 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లిజెల్ లీ, లారా వొల్వర్ట్ మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. 35 పరుగులు చేసిన లీ అవుట్‌కాగా, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సనే లుస్ 70 పరుగుల్లోనే 50 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచింది. లారా వొల్వర్ట్ 118 బంతుల్లో అజేయంగా 50 పరుగులు సాధించింది.
పాక్‌ను గెలిపించిన జవేరియా
ఐర్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో జవేరియా ఖాన్ పాకిస్తాన్‌ను విజయంలో కీలక భూమిక పోషించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 271 పరుగులు సాధించింది. జవేరియా 104 బంతుల్లో 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె స్కోరులో 14 బౌండరీలు ఉన్నాయి. ఓపెనర్ నహిదా ఖాన్ 76 బంతుల్లో 72 పరుగులు చేయగా, లోయల్ మిడిల్ ఆర్డర్‌లో నైనా అబిదీ 44 పరుగులు సాధించింది. కాగా, పాక్‌పై సంచలన విజయాన్ని నమోదు చేయడానికి 272 పరుగుల భారీ స్కోరు సాధించాల్సి ఉండగా, ఐర్లాండ్ 48.5 ఓవర్లలో 185 పరుగులకే అలౌటైంది. సెసిలియా జాయిస్ 41, కిమ్ గార్త్, ఇసోబెల్ జాయిస్ చెరి 33 చొప్పున పరుగులు చేసినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయారు.

చిత్రం.. మిథాలీ రాజ్ 73 నాటౌట్