క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో లంక గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, ఫిబ్రవరి 17: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతిని చామర కపుగడేర బౌండరీకి తరలించి, లంకను గెలిపించాడు. టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మైకేల్ క్లింగర్ 38, ట్రావిస్ హెడ్ 31 చొప్పున పరుగులు చేశారు.
శ్రీలంకకు విజయాన్ని అందించేందుకు అసెల గుణరత్నే (52), దిల్షాన్ మునవీర (44), ఓపెనర్ నిరోషన్ డిక్‌విల్లా (30) శ్రమించారు. కాగా, చివరిలో కపుగడేర, సీకుగే ప్రసన్న క్రీజ్‌లో ఉండగా, లంక లక్ష్యానికి చేరువైంది. ఆండ్రూ టయే వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆరు పరుగులు అవసరంకాగా, మొదటి బంతిని రక్షణాత్మకగా ఆడిన ప్రసన్న రెండో బంతిలో ఒక పరుగు చేశాడు. మూడో బంతిలో కపుగడేరా సింగిల్ తీయగా, నాలుగో బంతిని ప్రసన్న ఒక పరుగుకు పరిమితం చేశాడు. ఐదో బంతిలో కపుగడేర రెండు పరుగులు చేయడంతో స్కోరు సమమైంది. మ్యాచ్ ‘టై’ అవుతుందా లేక లంక గెలుస్తుందా అన్న ఉత్కంఠ నెలకొన్న దశలో, కపుగడేర చివరి బంతిని ఫోర్‌గా మార్చాడు. దీనితో లంక ఐదు వికెట్ల తేడాతో గెలిచి, మూడు మ్యాచ్ ఈ టి-20 సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 168 (ఆరోన్ ఫించ్ 43, మైఖేల్ క్లింగర్ 38, ట్రావిస్ హెడ్ 31, లసిత్ మలింగ 2/29).
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 (నిరోషన్ డిక్‌విల్లా 30, దిల్షాన్ మునవీర 44, అసెల గుణరత్నే 52, ఆడం జంపా 2/26, ఆస్టన్ టర్నర్ 2/12).