క్రీడాభూమి

స్మిత్, షాన్ సెంచరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: భారత్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల వామప్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విజృంభణ కొనసాగింది. ఆట ముగిసే సమయానికి, తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 327 పరుగులు చేసింది. నిజానికి ముగ్గురు బ్యాట్స్‌మెన్ అవుట్‌కాగా, సెంచరీలతో విజృంభించిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్, షాన్ మార్ష్ తమ సహచరులకు బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ఇవ్వడానికి రిటైర్డ్ అవుటయ్యారు. టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ‘ఎ’ ఆరంభంలో కొంత మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. 33 పరుగుల స్కోరువద్ద డేవిడ్ వార్నర్ (25)ను వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకోగా నవ్‌దీప్ సైనీ పెవిలియన్‌కు పంపాడు. మాట్ రెన్‌షా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌ల నిలవలేకపోయాడు. 41 బంతులు ఎదుర్కొని, 11 పరుగులు చేసిన అతను కూడా వార్నర్ మారిదిగానే సైనీ బౌలింగ్‌లో కిషన్‌కు చిక్కాడు. కాగా, ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టిన ఆనందం భారత్ ‘ఎ’కు ఎక్కువ సేపు నిలవలేదు. స్మిత్, షాన్ మార్ష్ క్రీజ్‌లో నిలదొక్కుకొని పరుగుల వరద పారించారు. స్మిత్ 161 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేసి రిటైర్డ్ అవుటయ్యాడు. షాన్ మార్ష్ 173 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 104 పరుగులు చేశాడు. అతను కూడా రిటైర్డ్ అవుట్‌ను ప్రకటించగా, పీటర్ హ్యాండ్స్‌కోమ్ 45 పరుగులు చేసి, కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో ప్రియాంక్ కిరీట్ పాంచాల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి మిచెల్ మార్ష్ (16), మాథ్యూ వేడ్ (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో సైనీ రెండు వికెట్లు కూల్చగా, హార్దిక్ పాండ్యకు ఒక వికెట్ లభించింది.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ సి ఇషాన్ కిషన్ బి నవ్‌దీప్ సైనీ 25, మాట్ రెన్‌షా సి ఇషాన్ కిషన్ బి నవ్‌దీప్ సైనీ 11, స్టీవెన్ స్మిత్ 107 రిటైర్డ్ అవుట్, షాన్ మార్ష్ 104 రిటైర్డ్ అవుట్, పీటర్ హ్యాండ్స్‌కోమ్ సి పాంచాల్ బి హార్దిక్ పాండ్య 45, మిచెల్ మార్ష్ 16 నాటౌట్, మాథ్యూ వేడ్ 7 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 327.
వికెట్ల పతనం: 1-33, 2-55, 3-211, 4-290, 5-305.
బౌలింగ్: అశోక్ దిండా 15.2-1-49-0, హార్దిక్ పాండ్య 17-3-64-1, నవ్‌దీప్ సైనీ 12.4-4-27-2, షాబాజ్ నదీం 23-0-90-0, అఖిల్ హెర్వాద్కర్ 11-0-48-0, శ్రేయాస్ అయ్యర్ 7-0-32-0, ప్రియాంక్ కిరీట్ పాంచాల్ 4-0-11-0.

చిత్రం..ఆస్ట్రేలియా సెంచరీ వీరులు స్టీవెన్ స్మిత్, షాన్ మార్ష్