క్రీడాభూమి

‘ప్రొఫెషనల్’ ఫైట్స్‌కు జితేందర్, అఖిల్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: భారత బాక్సర్లు జితేందర్ కుమార్, అఖిల్ కుమార్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్స్‌కు సిద్ధమయ్యారు. ఏప్రిల్ ఒకటి నుంచి వీరు తమతమ ప్రత్యర్థులతో ఆరేసి ఫైట్స్‌లో పోరాడతారు. ఆసియా క్రీడల్లో పతకం సాధించిన జితేందర్, కామనె్వల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ అఖిల్ ఇటీవలే ప్రొఫెషనల్స్‌గా మారారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించలేకపోయినప్పటికీ, వీరు చూపిన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. అప్పుడు పతకం సాధించిన విజేందర్ సింగ్ ఇప్పటికే ప్రొఫెషనల్ బాక్సర్‌గా రాణిస్తుండగా, జితేందర్, అఖిల్ కూడా అతని దారిలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు.
బిసిసిఐ జనరల్ మేనేజర్
ఆర్పీ షా రాజీనామా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) జనరల్ మేనేజర్ (కమర్షియల్) ఆర్పీ షా తన పదవికి రాజీనామా చేశాడు. వయసు మీద పడుతున్న కారణంగా తాను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేనన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 61 ఏళ్ల షా ప్రకటించాడు. బోర్డు పాలనా బాధ్యతను నలుగురు సభ్యులతో కూడిన కమిటీ చేపట్టిన తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగానే షా రాజీనామా చేశాడన్న వాదన ఉంది. అయితే, అతను మాత్రం ఈ నిర్ణ యం వ్యక్తిగతమేనని అంటున్నాడు.