క్రీడాభూమి

ఒత్తిడిని ధోనీ కనిపించనీయడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ దానిని ప్రదర్శించే అలవాటు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ధోనీపై వస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు సహజమని చెప్పాడు. తాను కూడా ఎన్నోసార్లు విమర్శలకు గురయ్యానని తెలిపాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా, ప్రశాంతంగా ఉండే లక్షణం ధోనీకి ఉన్న ప్రత్యేకతగా గంగూలీ అభివర్ణించాడు. అతను ఏమాత్రం ఒత్తిడికి గురికాడని చెప్పడానికి వీల్లేదన్నాడు. అయితే, ఒత్తిళ్లను సమర్థంగా అధిగమిస్తాడని తెలిపాడు. అలాంటి కెప్టెన్ భారత జట్టుకు అవసరమని చెప్పాడు.
కోచ్‌గా బాధ్యతలు తీసుకోలేను
ప్రస్తుత పరిస్థితుల్లో తాను కోచ్‌గా బాధ్యతలు తీసుకోలేనని గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడిగా ఉన్నానని చెప్తూ, కోచ్‌గా పూర్తికాల సేవలు అందించడం సాధ్యం కాదని అన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆధ్వర్యంలోని క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సిఎసి) సభ్యుడిగా ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారన్న ప్రశ్నపై స్పందిస్తూ, నిజానికి ఆ కమిటీ ఉందో లేదో కూడా తనకు తెలియదని వ్యాఖ్యానించాడు. పనిని ఎక్కడ, ఎలా మొదలు పెట్టాలో కూడా తనకు తెలియదన్నాడు. అయితే, భారత క్రికెట్ మెరుగుదలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉంటానని తెలిపాడు.