క్రీడాభూమి

శ్రేయాస్ అజేయ అర్ధ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 85 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఐదు వికెట్లకు 327 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించి, 434 పరుగుల వద్ద మాథ్యూ వేడ్ (64) వికెట్‌ను చేజార్చుకుంది. అతను అఖిల్ హెర్వాద్కర్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు దొరికాడు. మరో హాఫ్ సెంచరీ వీరుడు మిచెల్ మార్ష్ 75 పరుగులు చేసి, సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఇంద్రజిత్ క్యాచ్ పట్టగా, షాబాజ్ నదీం బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివరిలో గ్లేన్ మాక్స్‌వెల్ (16 నాటౌట్), స్టెఫెన్ ఒకీఫ్ (8 నాటౌట్) జట్టు స్కోరును 7 వికెట్లకు 469 పరుగులకు చేర్చగా, తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ప్రకటించాడు.
హార్దిక్ పాండ్య నాయకత్వం వహిస్తున్న భారత్ ‘ఎ’ తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే, 19 పరుగులకే మొదటి వికెట్ హెర్వాద్కర్ (4) రూపంలో కూలింది. నాథన్ లియాన్ రిటర్న్ క్యాచ్ అందుకొని అతనిని అవుట్ చేశాడు. 62 బంతుల్లో 36 పరుగులు చేసిన ప్రియాంక్ కిరీట్ పాంచాల్‌ను లియాన్ క్యాచ్ పట్టగా పీటర్ హ్యాండ్స్‌కోమ్ అవుట్ చేశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ నిలకడగా ఆడుతూ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. అయితే, అంకిత్ బవ్నే (25), కెప్టెన్ హార్దిక్ పాండ్య (19) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 51 ఓవర్లలో నాలుగు వికెట్లకు 176 పరుగులు చేసింది. అప్పటికి రిషభ్ పంత్ (3)తో కలిసి నాటౌట్‌గా ఉన్న శ్రేయాస్ 93 బంతుల్లో 85 పరుగులు సాధించాడు. అతను ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు.