క్రీడాభూమి

ఈస్ట్‌కు టైటిల్ -- ముస్తాక్ అలీ టి-20 క్రికెట్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18: ముస్తాక్ అలీ టి-20 అంతర్ మండల క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. యువ సంచలన ఆటగాడు విరాట్ సింగ్, అనుభవజ్ఞుడు ఇశాంక్ జగ్గీ అర్థ శతకాలతో రాణించగా, వెస్ట్ జోన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ని ఈస్ట్ ఎనిమిది వికెట్ల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రత్యేకంగా ఫైనల్ అంటూ ఉండదు. ఏ జట్టు ఎక్కువ విజయాలను సాధిస్తుందో, ఆ జట్టుకే టైటిల్ దక్కుతుంది. కాగా, ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేసిన ఈస్ట్ టైటిల్‌ను అందుకుంది. ఈ జట్టు టైటిల్ సాధించడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. కాగా, చివరి రోజైన శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ రెండు వికెట్ల తేడాతో గెలిచి, రన్నరప్‌గా నిలిచింది. ఒకవేళ సెంట్రల్ ఓడితే, వెస్ట్‌కు రెండో స్థానం లభించేది.
తన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో వెస్ట్‌తో పోటీపడిన ఈస్ట్ కెప్టెన్ మనోజ్ తివారీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నకారణంగా, ఛేజింగ్ సులభమన్న అతని అంచనా నిజమైంది. ముందు బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. ఓపెనర్ షెల్డన్ జాక్సన్ 44 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు. చివరిలో రుజుల్ భట్ 20 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈస్ట్ బౌలర్ ప్రీతం దాస్ 25 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. సూర్యకాంత్ ప్రధాన్, ప్రజ్ఞాన్ ఓఝా చెరొక వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు.
చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌ని కూడా విజయంతో ముగించాలన్న పట్టుదలతో ఉన్న ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్లు అరుణ్ కార్తీక్ విరాట్ సింగ్ శుభారంభాన్నిచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 14 బంతుల్లో 24 పరుగులు (రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) చేసిన అరుణ్‌ను పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోగా శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. మరో ఓపెనర్ విరాట్ సింగ్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడగా, ఈ టోర్నీలో అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్న ఇశాంక్ జగ్గీ అతనితో చేరాడు. ఇద్దరూ వెస్ట్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించారు. రెండో వికెట్‌కు 80 పరుగుల అత్యంత కీలకమైన భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి జగ్గీ వెనుదిరిగాడు. 30 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో చెలరేగిన అతను 56 పరుగులు సాధించాడు. సెకండ్ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ మనోజ్ ప్రభాకర్ (9 నాటౌట్)తో కలిసి 13.4 ఓవర్లలో భారత్‌ను విజయపథంలో నడిపిన విరాట్ సింగ్ 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 34 బంతులు ఎదుర్కొన్న అతను ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్ల భారీ తేడా విజయభేరి మోగించింది.
సంక్షిప్త స్కోర్లు
వెస్ట్ జోన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 (షెల్డన్ జాక్సన్ 52, రుజుల్ భట్ 36 నాటౌట్, ప్రేరక్ మన్కడ్ 20, ప్రీతం దాస్ 2/25, సూర్యకాంత్ ప్రధాన్ 1/28, సయాన్ ఘోష్ 1/32, ప్రజ్ఞాన్ ఓఝా 1/18).
ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్: 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 153 (అరుణ్ కార్తీక్ 24, విరాట్ సింగ్ 58 నాటౌట్, ఇశాంక్ జగ్గీ 56).

చిత్రం...ముస్తాక్ అలీ టి-20 అంతర్ మండల క్రికెట్ చాంపియన్‌షిప్ టైటిల్‌తో ఈస్ట్ జోన్