క్రీడాభూమి

జాబితాలో కొత్త ముఖాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 19: ఈసారి ఐపిఎల్‌లో అవకాశం కోసం చాలా మంది కొత్త ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. భారతీయుల విషయానికి వస్తే, పలువురు యువ ఆటగాళ్లు ఐపిఎల్‌లో, తద్వారా టీమిండియాలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ నటరాజన్ ఇటీవల జరిగిన అంతర్ రాష్ట్ర టి-20 టోర్నమెంట్‌లో పది వికెట్లు పడగొట్టి ఫ్రాంచైజీలను ఆకట్టుకుంటున్నాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ విష్ణు వినోద్ టి-20 ఫార్మాట్‌లో 307 పరుగులు సాధించాడు. అంతర్ రాష్ట్ర టోర్నీలో 14 సిక్స్‌లు కొట్టాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అంకిత్ బావ్నే కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తున్నాడు. ఇక ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, టీనేజ్ సంచలనం పృథ్వీ షాకు డిమాండ్ బాగా ఉంటుందని నిపుణుల అంచనా. 17 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభావంతుడిగా పేరు సంపాదించిన అతని కోసం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ పోటీపడుతున్నట్టు సమాచారం. మరో ఓపెనర్ తన్మయ్ అగర్వార్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఐపిఎల్‌లోకి దూసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏఏ ఫ్రాంచైజీలు వీరి పట్ల మొగ్గు చూపుతాయో వేచిచూడాలి. విదేశీ క్రీడాకారుల విషయానికి వస్తే, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బేస్ ప్రైస్ 30 లక్షలు. అతని కోసం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్, ఢిల్లీ డేర్‌ఢెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తదితర ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రెండు కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌కే చెందిన ఫాస్ట్ బౌలర్ టైమన్ మిల్స్, వెస్టిండీస్ ఆటగాళ్లు కెస్రిక్ విలియమ్స్ (్ఫస్ట్ బౌలర్), నికొలాస్ పూరన్ (వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్), ఎవిన్ లూయిస్ (ఓపెనర్), దక్షిణాఫ్రికాకు చెందిన కాగిసో రబదా (్ఫస్ట్ బౌలర్) ఐపిఎల్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్ తనకు భారీ మొత్తం లభిస్తుందన్న ఆశతో ఉన్నాడు.