క్రీడాభూమి

మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఏక్తా మెరుపు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 19: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ చివరి సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్‌తో ఢీకొన్న పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో చిత్తయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను ఎక్తా బిస్త్ దారుణంగా దెబ్బతీసింది. ఆమె మెరుపు బౌలింగ్‌ను కుదేలైన పాక్ 43.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. ఎక్తా 10 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 8 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె వేసిన ఓవర్లలో 7 మెయిడిన్లు కావడం విశే షం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఎలాం టి ఇబ్బంది లేకుండా, 22.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మ అజేయంగా 29 పరుగులు చేసింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది.
ఇతర మ్యాచ్‌ల విషయానికి వస్తే, బంగ్లాదేశ్‌ను శ్రీలంక 42 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 197 పరుగులు చేసింది. ఆతర్వాత వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 111 పరుగులుగా నిర్ణయించారు. కానీ, ఆ జట్టు పరుగుల వేటలో తడబడి, 5 వికెట్లకు 68 పరుగులు చేయగలిగింది.
మరో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 49.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లోనూ వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, 21 ఓవర్లలో వికెట్ నష్టపోయి 82 పరుగులు చేసిన దక్షిణాఫ్రికాను డక్‌వర్త్ లూయిస్ విధానంలో విజేతగా అధికారులు ప్రకటించారు.

వర్షం వెంటాడిన మ్యాచ్‌లో
కివీస్‌పై దక్షిణాఫ్రికా గెలుపు
హామిల్టన్, ఫిబ్రవరి 19: వర్షం వెంటాడగా, 50 ఓవర్ల నుంచి 34 ఓవర్లకు కుదించిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఎబి డివిలియర్స్, ఆండిల్ ఫెహ్లుక్వాయో చివరి క్షణాల్లో పరుగుల వేటలో సఫలమై, మరొక్క బంతి మిగిలి ఉండగా దక్షిణాఫ్రికాను గెలిపించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 34 ఓవర్లలో ఏడు వికెట్లకు 207 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 59 పరుగులకు టాప్ స్కోరర్‌గా నిలచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 33.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 210 పరుగులు చేసింది. ఓపెన్ క్వింటన్ డికాక్ 69 పరుగులు సాధించగా, కెప్టెన్ ఎబి డివిలియర్స్ 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆండిల్ ఫెహ్లుక్వాయో అజేయంగా 29 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
చివరి బంతికి నెగ్గిన లంక
సౌత్ గీలాంగ్, ఫిబ్రవరి 19: ఆస్ట్రేలియాతో చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన రెండో టి-20 మ్యాచ్‌ని రెండు వికెట్ల తేడాతో గెల్చుకున్న శ్రీలంక, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 173 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ మఖేల్ క్లింగర్ (43), మోజెస్ హెన్రిక్స్ (56 నాటౌట్) నిలకడగా ఆడినప్పటికీ ఆసీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. లంక బౌలర్లలో నవాన్ కులశేఖర 31 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆతర్వాత పరుగుల వేట మొదలు పెట్టిన శ్రీలంకకు అసెల గుణరత్నే (84 నాటౌట్) అండగా నిలిచాడు. అతని ప్రతిభ లంకను గెలిపించింది. ఆ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 176 పరుగులు చేసి, సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

వేడ్, వార్నర్ స్లెడ్జింగ్!
ముంబయి: ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్, సీనియర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ స్లెడ్జింగ్ మొదలుపెట్టారా? వామప్ మ్యాచ్‌లోనే తమ ప్రతాపం చూపి, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తమ వైఖరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారా? భారత బ్యాట్స్‌మన్, డబుల్ సెంచరీ హీరో శ్రేయాస్ ఈ ప్రశ్నలకు అవునని సమాధానమిస్తున్నాడు. వేడ్, వార్నర్ తనను హేళన చేశారని, స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని శ్రేయాస్ ఆరోపించాడు. అయితే, తాను ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి కేంద్రీకరించానని తెలిపాడు.