క్రీడాభూమి

ధోనీపై వేటు పుణే కెప్టెన్‌గా స్మిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: మహేంద్ర సింగ్ ధోనీపై రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్ వేటు వేసింది. అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవలే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి వైదొలగిన ధోనీకి ఇప్పుడు ఐపిఎల్ ఫ్రాంచైజీ నాయకత్వం కూడా చేజారింది. ధోనీ వైదొలగలేదని, తామే స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించామని ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా తెలిపాడు. ధోనీ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, జట్టులో సభ్యుడుగా అతను కొనసాగుతాడని గోయెంకా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.