క్రీడాభూమి

దక్షిణాఫ్రికాతో పోరుకు భారత్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 20: మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈరెండు జట్లు ఇప్పటికే ఐసిసి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే అర్హత సంపాదించాయి. దీనితో, మంగళవారం జరిగే క్వాలిఫయర్స్ ఫైనల్ ఫలితం ఇరు జట్లపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, రాబోయే మెగా టోర్నీని దృష్టిలో ఉంచుకొని రెండు జట్లు ఆధిపత్యాన్ని చాటుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాగితంపై చూస్తే, డేన్ వాన్ నీకెర్క్ కెప్టెన్సీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా కంటే మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది. పైగా పోటీ భారత ఉపఖండంలో జరుతున్నందున మిథాలీ సేనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

చిత్రం..మహిళల ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ట్రోఫీతో
భారత, దక్షిణాఫ్రికా కెప్టెన్లు మిథాలీ రాజ్, డేన్ వాన్ నీకెర్క్