క్రీడాభూమి

నేగీకి కోటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: నిరుడు భారత క్రికెటర్లలో అత్యధిక ధర పొందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ పవన్ నేగీ ఈసారి కోటి రూపాయలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. నిరుడు వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అతనికి ఏకంగా 8.5 కోట్ల రూపాయలు చెల్లించింది. అప్పట్లో 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి వెళ్లిన అతనికి అంత భారీ మొత్తం లభించడం నిరుడు చర్చనీయాంశమైంది. 2011 వరల్డ్ కప్‌ను భారత్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ కంటే నేగీకి ఎక్కువ మొత్తం లభించడాన్ని ఎవరూ నమ్మకలేకపోయారు. కాగా, ఏడాది కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతనిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం కోటి రూపాయలు చెల్లించింది. ఈ వేలంలో నేగీకి 30 లక్షల బేస్ ప్రైస్ లభించింది.