క్రీడాభూమి

ముంబయి సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇండియన్ హాకీ లీగ్ (ఐహెచ్‌ఎల్)లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ముంబయి సంచలనం సృష్టించింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న రాంచీ రేస్‌ను 7-5 తేడాతో ఓడించి, వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తొలి ఓటమిని నమోదు చేసింది. మ్యాచ్ 11వ నిమిషంలో ముంబయికి దివాకర్ రామ్ తొలి గోల్‌ను అందించగా, మరో ఏడు నిమిషాల్లోనే రాంచీకి కెప్టెన్ ఆష్లే జాక్సన్ ఈక్వెలైజర్‌ను అందించాడు. 21వ నిమిషంలో ముంబయి కెప్టెన్ మాథ్యూ స్వాన్ గోల్ సాధించగా, 38వ నిమిషంలో రాంచీకి సర్వన్జిత్ సింగ్ గోల్‌ను సంపాదించిపెట్టాడు. ఆష్లే జాక్సన్ 41వ నిమిషంలో గోల్ చేయడంతో రాంచీకి తొలిసారి ముంబయిపై ఆధిక్యం లభించింది. కానీ, కొన్ని క్షణాల వ్యవధిలోనే నీలకంఠ శర్మ ద్వారా ముంబయికి ఈక్వెలైజర్ దక్కింది. 48వ నిమిషంలో ఫ్లోరియన్ ఫచ్ ముంబయి తరఫున గోల్ చేయగా, రాంచీకి 59వ నిమిషంలో సందీప్ సింగ్ ద్వారా గోల్ లభించింది. నిబంధనల ప్రకారం ఫీల్డ్ గోల్స్‌కు అదనంగా మరో గోల్ దక్కడంతో ముంబయి విజయభేరి మోగించింది. కాగా, ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయాన్ని సాధించిన ముంబయ పాయం ట్ల పట్టికలో అట్టడుగు స్థానంలోనే కొనసాగుతున్నది. ఈ మ్యాచ్‌లో ఓడిన ప్పటికీ రాంచీ మొత్తం 22 పాయంట్లతో అగ్రస్థానంలోనే ఉంది.