క్రీడాభూమి

స్టోక్స్‌కు జాక్‌పాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 20: పదవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు జాక్‌పాట్ దక్కింది. ఎవరూ ఊహించని విధంగా అతనిని రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ 14.50 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఈసారి ఐపిఎల్‌లో ఇదే అత్యధిక ధర. పుణే యాజమాన్యం వేలం జరుగుతున్న సమయంలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను సంప్రదిస్తునే ఉంది. మహేంద్ర సింగ్ ధోనీని తప్పించి, ఆ స్థానంలో స్మిత్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్టు పుణే ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్టోక్స్ కోసం స్మిత్ పట్టుబట్టినట్టు సమాచారం. ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా అతని కోసం పోటీపడ్డాయి. ఈ మూడు జట్లు 10.5 కోట్ల రూపాయల వద్ద ఆగిపోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 12.50 కోట్ల వరకూ ప్రయత్నం చేసింది. పుణే మరింత ముందుకెళ్లి పధ్నాలుగున్నర కోట్ల రూపాయలు ఆఫర్ చేసి, స్టోక్స్‌ను తన జట్టులో చేర్చుకుంది. కాగా, అత్యధిక ధర లభించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం కూడా ఇంగ్లాండ్ క్రికెటర్‌కే లభించడం విశేషం. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ టైమల్ మిల్స్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మరో ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ వోక్స్‌కు 4.2 కోట్ల రూపాయలు లభించాయి. అతనిని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భారీ ధరలు పలికితే, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు అదే స్థాయిలో డిమాండ్ లేకపోవడం గమనార్హం. అతనిని రెండు కోట్ల రూపాయలు చెల్లించి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తీసుకుంది. ఎవరికీ అంతగా పరిచయం లేని తమిళనాడు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్‌ను మూడు కోట్ల రూపాయలకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తీసుకుంది. 10 లక్షల బేస్ ప్రైస్ (కనీస ధర) ఉన్న నటరాజన్‌కు ఇంత భారీ మొత్తం లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత టెస్టు జట్టుకు కొంతకాలంగా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న రాజస్థాన్ ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ అనికేత్ చౌదరిని రెండు కోట్ల రూపాయలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది. కర్నాటక యువ ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతంకు కూడా రెండు కోట్ల రూపాయలు లభించాయి. అతనిని ముంబయి ఇండియన్స్ జట్టు తీసుకుంది. భారత జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన వరుణ్ ఆరోన్‌కు 2.8 కోట్ల రూపాయలు చెల్లించి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తీసుకోగా, లెగ్ స్పిన్నర్ కర్న్ శర్మను 3.2 కోట్ల రూపాయలకు ముంబయి ఇండియన్స్ తన జాబితాలో చేర్చుకుంది.

చిత్రాలు..ఊహించని ధర బెన్ స్టోక్స్, టైమల్ మిల్స్