క్రీడాభూమి

సెమీస్‌కు చేరువైన హారిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెహ్రాన్, ఫిబ్రవరి 21: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్ మాస్టర్, ‘తెలుగు తేజం’ ద్రోణవల్లి హారిక సెమీఫైనల్‌కు చేరువైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి గేమ్‌లో ఆమె జార్జియాకి చెందిన ననా జగ్నిద్జేపై విజయం సాధించింది. రెండు గేముల మినీ మ్యాచ్‌లో హారిక తొలి గేమ్‌లోనే ప్రత్యర్థిని మట్టికరిపించడం విశేషం. దీంతో హారిక సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలంటే ఇక రిటర్న్ గేమ్‌ను కనీసం డ్రాగా ముగించినా సరిపోతుంది. ఇదిలావుంటే, ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన ఉక్రెయిన్ క్రీడాకారిణి అనా ముజిచుక్ కూడా సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌లో ఆమె మాజీ చాంపియన్ అంటోవానెటా స్ట్ఫెనోవా (బల్గేరియా)ను చిత్తు చేసింది. అయితే రష్యాకు చెందిన మరో మాజీ విజేత అలెగ్జాండ్రా కొస్తెనియుక్‌కు, చైనాకు చెందిన నీ షికున్‌కు మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. అలాగే చైనా క్రీడాకారిణిలు తాన్ జోంగ్యీ, టాప్ సీడ్ జు వెన్‌జున్ మధ్య జరిగిన గేమ్ కూడా డ్రాగానే ముగిసింది.