క్రీడాభూమి

భారత్‌లో టాస్‌కు ప్రాధాన్యత లేదు : లీమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఫిబ్రవరి 21: క్రికెట్‌లో టాస్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అందరూ అంటారు. అయితే భారత్‌లో టాస్‌కు పెద్దగా ఎలాంటి ప్రాధాన్యత ఉండదని ఆస్ట్రేలియా జట్టు కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయ పడ్డాడు. గతంలో తాము భారత్‌లో వరసగా నాలుగు టాస్‌లు గెలిచామని, అయినప్పటికీ 4-0 తేడాతో సిరీస్ కోల్పోయామని కూడా లేమన్ గుర్తు చేశాడు. అంతేకాదు టాస్ గెలిచినప్పటికీ బాగా ఆడకపోతే విజయం సాధ్యం కాదని కూడా ఆయన అన్నాడు. కాగా, గురువారంనుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో మంచి వికెట్లనే తయారు చేస్తారని తాము భావిస్తున్నట్లు లీమన్ అన్నాడు.