క్రీడాభూమి

ట్రోఫీ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 21: మహిళల ప్రపంచ కప్ వనే్డ క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని పి.సరా ఓవల్ స్టేడియంలో మంగళవారం చిట్టచివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో భారత జట్టు 1 వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మిథాలీ రాజ్‌కు బదులుగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ చివర్లో ఎంతో సమయోచితంగా ఆడి భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్లు లిజెల్లీ లీ (37), వోల్వార్డ్ (21) సహా టాప్ ఆర్డర్‌లో డు ప్రీజ్ (40), వికెట్‌కీపర్ టి.చెట్టి (22), సిఎల్.ట్రియోన్ (23), కెప్టెన్ వాన్ నీకెర్క్ (37), ఎస్.లస్ (35) చక్కగా రాణించారు. అయితే భారత బౌలర్లు రాజేశ్వరీ గైక్వాడ్ (3/51), శిఖా పాండే (2/41), పూనమ్ యాదవ్ (1/37), ఏక్తా బిస్త్ (1/39), దీప్తి శర్మ (1/46) సమర్థవంతంగా ప్రతిఘటించడంతో దక్షిణాఫ్రికా జట్టు 49.4 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం 245 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ తిరుష్కామిని 10 పరుగులు మాత్రమే సాధించి ఎనిమిదో ఓవర్‌లో నిష్క్రమించింది. అయితే ఓపెనర్ మోనా మెషమ్,్ర ఫస్ట్‌డౌన్‌లో దిగిన దీప్తి శర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొని చెరో అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు రెండో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆ తర్వాత దీప్తి శర్మ 71 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లెత్సోలా బౌలింగ్‌లో వోల్వార్డ్‌కు క్యాచ్ ఇవ్వగా, ఎనిమిది బంతుల తర్వాత మోనా మెషమ్ (59)ను వాన్ నీకెర్క్ పెవిలియన్‌కు చేర్చి భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ తరుణంలో వేదా కృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్ కౌర్ స్థిమితంగా ఆడి నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అనంతరం వేదా కృష్ణమూర్తి (31) మరిజానా కప్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక చెట్టి చేతికి చిక్కగా, ఆమె స్థానంలో వచ్చిన శిఖా పాండే (12), దేవికా వైద్య (0), సుష్మా వర్మ (0), ఏక్తా బిస్త్ (6) త్వరత్వరగా నిష్క్రమించారు. దీంతో విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిన భారత జట్టు చివరి ఓవర్‌లో తొలి బంతికే పూనమ్ యాదవ్ (7) వికెట్‌ను రనౌట్ రూపంలో కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. అయితే లెత్సోలా వేసిన ఆ ఓవర్‌లో ఐదో బంతిని సిక్సర్‌గా మలచిన హర్మన్‌ప్రీత్ కౌర్ (41-నాటౌట్), చివరి బంతికి మరో రెండు పరుగులు రాబట్టి మిగిలిన పని పూర్తి చేసింది. దీంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించిన భారత జట్టు ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సంచలన విజయాన్ని అందుకుంది.

చిత్రాలు...టీమిండియాను గెలిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్
*ట్రోఫీతో సంబరాలు జరుపుకొంటున్న భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు