క్రీడాభూమి

శాగ్ క్రీడాజ్యోతి రిలే మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్) క్రీడాజ్యోతి రిలే బుధవారం ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జెపి రాజ్‌కొవ జెండాను ఊపి, రిలేను మొదలుపెట్టాడు. రాజ్ భవన్ హెలిపాడ్ వద్ద క్రీడాజ్యోతి ప్రయాణం ఆరంభంకాగా, సుమారు 2,000 మంది విద్యార్థులు, పలువురు అథ్లెట్లు, అభిమానులు హాజరై వీడ్కోలు పలికారు. శాగ్‌కు ఆతిథ్యమిస్తున్న అస్సాం నుంచి ఇక్కడికి చేరుకున్న శాగ్ క్రీడాజ్యోతి ఈశాన్య రాష్ట్రాల మీదుగా గౌహతి చేరుతుంది.
శాగ్ బృందానికి పాక్ క్లియరెన్స్
కరాచీ: భారత్‌తో ఈనెల 5 నుంచి మొదలయ్యే దక్షిణాసియా గేమ్స్ (శాగ్)లో పాల్గొనే బృందానికి పాకిస్తాన్ ప్రభుత్వం క్లియరెన్స్‌ను ఇచ్చింది. దీనితో పాక్ బృందం భారత్‌కు వెళ్లగలి గింది. 456 మంది సభ్యులతో కూడిన బృందానికి శాగ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని పాకిస్తాన్ క్రీడా బోర్డు డైరెక్టర్ జనరల్ అక్తర్ గనే్జరా ప్రకటించాడు. ఫీల్డ్ హాకీసహా పాకిస్తాన్ మొత్తం 22 క్రీడాంశాల్లో పోటీపడుతుందని పేర్కొన్నాడు. భారత్‌లో పాక్ క్రీడాకారుల భద్రతకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశాడు. ఈ పరిణామం వల్ల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు మెరగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత ఫుట్‌బాల్ ప్రాబబుల్స్ ఖరారు
న్యూఢిల్లీ: శాగ్‌లో పాల్గొనే భారత ఫుట్‌బాల్ జట్టుకు ప్రాబబుల్స్ జాబితా ఖరారైంది. పోటీలు ఆరంభం కావడానికి మూడు రోజుల ముందు హడావుడిగా ప్రాబబుల్స్ జాబితాను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) ప్రకటించింది. వారిలో 21 మంది ఇప్పటికే గౌహతిలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో ఉన్నారు. భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీపడుతున్నది. మొదటి మ్యాచ్ శ్రీలంకతో ఈనెల 6న జరుగుతుంది. 10న మాల్దీవ్స్‌ను ఢీ కొంటుంది.

ఫెదరర్ మోకాలికి
శస్తచ్రికిత్స

బసెల్ (స్విట్జర్లాండ్): కెరీర్‌లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు రోజర్ ఫెదరర్ మోకాలికి జరిపిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. కనీసం నెల రోజుల విశ్రాంతి అవసరమవుతుందని వైద్యులు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ సెమీ ఫైనల్‌లో నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌ను ఢీకొని 1-6, 2-6, 6-3, 3-6 తేడాతో ఓటమిపాలైన ఫెదరర్‌కు ఫిట్నెస్ సమస్యలు చాలా అరుదు అనే చెప్పాలి. అతనికి చాలాకాలం కీలక ప్రత్యర్థిగా ఉన్న రాఫెల్ నాదల్ గాయాల కారణంగా కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నాడు. అయితే, 34 ఏళ్ల వయసులోనూ ఉత్తమ నైపుణ్యాన్ని కనబరుస్తున్న ఫెదరర్ ఫిట్నెస్ విషయంలోనూ తన కంటే చిన్న వారి కంటే మెరుగ్గా ఉన్నాడు. కాగా, కొంతకాలం టెన్నిస్‌కు దూరం కావడం తనను ఎంతగానో బాధిస్తున్నదని ఫెదరర్ ట్వీట్ చేశాడు. అయితే, గాయం పూర్తిగా నయమైతే, ఆతర్వాత కెరీర్‌ను కొనసాగించడంలో ఇబ్బందులు ఉండవని

టి-20 వరల్డ్ కప్ టోర్నీకి
5న టీమిండియా ఎంపిక
ముంబయి: బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌తోపాటు స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే టీమిండియాను సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఈనెల 5వ తేదీన ఎంపిక చేస్తుంది. ఢిల్లీలో జరిగే సమావేశంలో సెలక్టర్లు సమావేశమై, ఆటగాళ్లను ఎంపిక చేస్తారని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్‌లోగా శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను స్వదేశంలో ఆడుతుంది. అనంతరం ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఈనెల 24 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకూ ఆసియా కప్ చాంపియన్‌షిప్ బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. గతంలో ఈ టోర్నీని 50 ఓవర్ల ఫార్మెట్‌లో నిర్వహించేవారు. టి-20 ఫార్మెట్‌గా మార్చిన తర్వాత మొదటిసారి ఈ పోటీలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా మీర్పూర్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ ఢీ కొంటుంది. 27వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడతుంది. మార్చి 1న శ్రీలంకను ఎదుర్కొంటుంది. మార్చి 3న క్వాలిఫయర్ జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఇలావుంటే, ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ఈ టోర్నీలో మిగిలివున్న ఒక స్థానాన్ని భర్తీ చేసేందుకు క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగుతుంది. కాగా, టి-20 ప్రపంచ కప్ వచ్చేనెల 8వ తేదీ నుంచి మొదలవుతుంది.

పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్
ఇస్రార్‌కు ఘన నివాళి

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ కురువృద్ధుడు ఇస్రార్ అలీకి మాజీ ఆటగాళ్లు, అధికారులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. పంజాబ్ ప్రావీన్స్‌లోని స్వస్థలమైన ఒకారాలో ఇస్రార్ తన 88వ ఏట మృతి చెందాడు. అతని మృతికి మాజీ టెస్టు క్రికెటర్ హనీఫ్ మహమ్మద్‌సహా పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ ఒక లెజెండరీ క్రికెటర్‌ను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. 1952లో పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించి రెండు టెస్టులు ఆడింది. ఆ మ్యాచ్‌లతోనే పాక్ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. దేశ తొలి టెస్టు ఆడిన జట్టులోని సభ్యుల్లో ఒకడిగా పేరు సంపాదించిన ఇస్రార్ 1959లో ఆస్ట్రేలియాలో పర్యటించాడు. ఆ సిరీస్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే అతను కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. మొత్తం మీద కెరీర్‌లో 4 టెస్టులు ఆడిన అతను 33 పరుగులు చేశాడు. 318 బంతులు వేసి 6 వికెట్లు కూల్చాడు. అదే విధంగా 40 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆడి, 1,130 పరుగులు చేశాడు. 6,190 బంతులు వేశాడు. 114 వికెట్లు సాధించాడు. పాకిస్తాన్‌లో తొలి ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గత ఏడాది జనవరిలో అస్లామ్ ఖోకర్ తన 91వ ఏటా మృతి చెందిన తర్వాత పాకిస్తాన్‌లో జీవించి ఉన్న క్రికెటర్లలో ఎక్కువ వయసుగల వారి జాబితాలో ఇస్రార్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతని మృతితో క్రికెట్ ప్రపంచం చిన్నబోయిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో పేర్కొంది.