క్రీడాభూమి

రాంచీ టు హౌరా రైల్లో ధోనీ ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 22: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సుమారు 13 సంవత్సరాల తర్వాత జార్ఖండ్ వనే్డ క్రికెట్ జట్టుతో కలిసి రైల్లో ప్రయాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనడానికి జార్ఖండ్ జట్టుతో కలిసి వెళ్లడానికే ధోనీ మొగ్గు చూపాడు. క్రియ యోగా ఎక్స్‌ప్రెస్ టూ-టైర్ ఎసి కోచ్‌లో అతను సహచరులతో కలిసి రాంచీ నుంచి హౌరా వరకూ ప్రయాణించాడు. మిగతా ప్రయాణికులతో కలిసి సాధారణ పౌరుడిగా రైల్లో వెళ్లడానికి ఇష్టపడిన అతను తనకంటూ ప్రత్యేక వసతులు కల్పించాలని కోరలేదని అధికారులు తెలిపారు.
ఆసీస్‌కు ఊరట
అడిలైడ్, ఫిబ్రవరి 22: శ్రీలంకతో టి-20 సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, చివరి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియాకు ఊరట లభించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 187 పరుగులు చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (53), మైఖేల్ క్లింగర్ (62) అర్ధ శతకాలతో రాణించారు. లంక బౌలర్లు లసిత్ మలింగ, దసున్ షణక చెరి రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లంక లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, 18 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దిల్షాన్ మునవీర (37), మిలింద సిరివర్ధన (35) తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

పొరపాట్లు దిద్దుకుంటే..
పుణే: పొరపాట్లను చక్కదిద్దుకొని, ఆటగాళ్లంతా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తే, ఆస్ట్రేలియా చాలా కొద్దికాలంలోనే మళ్లీ ఫామ్‌కి వచ్చి, ప్రపంచ క్రికెట్‌ను శాసించే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల నిలకడలేమితో అల్లాడుతున్నప్పటికీ, ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం తగదు. కొద్ది దశాబ్దాలు ప్రపంచ క్రికెట్‌ను ఆసీస్ శాసించింది. ప్రొఫెషనల్ జట్టు అంటే ఏమిటో రుచిచూపింది. సమర్థులకు కొదువలేని ఆస్ట్రేలియాలో జాతీయ జట్టు మరోసారి తిరుగులేని శక్తిగా ఎదగడం అసాధ్యమేమీ కాదు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం కోహ్లీ బృందానికి చేదు అనుభవం తప్పదు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాకు ఉన్న పేరును గుర్తుచేసుకోవాలి. ఇంత వరకూ ఆడిన టెస్టుల్లో ఆసీస్ 47 శాతం మ్యాచ్‌లను గెల్చుకుంది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా 37 శాతం మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. సగటుల్లో కనిపిస్తున్న తేడానే ఆస్ట్రేలియా సత్తా ఏమిటో స్పష్టం చేస్తున్నది. అందుకే, టీమిండియా ఆచితూచి అడుగులు వేయాలి.

వార్నర్‌పైనే భారం
పుణే: ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం ఎక్కువగా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పైనే భారం వేసింది. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అతను ఓపెనర్‌గా ఆసీస్‌కు పలుమార్లు అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. అతను ఇప్పటి వరకూ కెరీర్‌లో 18 టెస్టు సెంచరీలు సాధించాడు. వాటిలో 17 స్వదేశంలో లేదా దక్షిణాఫ్రికాలో చేసినవే కావడం విశేషం. భారత ఉప ఖండంలోనూ సత్తా చాటాలని అతను భావిస్తున్నాడు. కాగా, వార్నర్ తర్వాత, బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా ఆసీస్‌కు అండగా నిలవనున్నాడు. షాన్ మార్ష్ తదితరులు ప్రతిభావంతులేగానీ, భారత్ పిచ్‌లపై ఎంత వరకు రాణిస్తారో చూడాలి. బౌలింగ్ విభాగానికి వస్తే మిచెల్ స్టార్క్, జొస్ హాజెల్‌వుడ్ ఫాస్ట్ బౌలింగ్ భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టడం ఖాయం. స్పిన్నర్ నాథన్ లియాన్ ఇక్కడి పిచ్‌ల తీరును ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

ఐసిసి మహిళల బ్యాటింగ్
‘టాప్-10’లో మిథాలీ, కౌర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన వనే్డ ప్రపంచ ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌కు రెండో స్థానం లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ‘టాప్-10’లో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమన్ మెగ్ లానింగ్ 804 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

గట్టిపోటీనిస్తాం
ఆసీస్ కెప్టెన్ స్మిత్ ధీమా
పుణే, ఫిబ్రవరి 22: నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు గట్టిపోటీనిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌లో ఇంత వరకూ పట్టించిన ఆసీస్ జట్లలో ఇదే అత్యంత బలహీనమైనదంటూ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను అతను తోసిపుచ్చాడు. ఎవరి అభిప్రాయాలు వారివని, అయితే, టీమిండియాతో పోటీపడే సత్తా తమకు ఉందని అన్నాడు. శ్రీలంకలో పర్యటించినప్పుడు, ఉప ఖండంలో ఏ విధంగా ఆడాలన్నది తెలిసిందన్నాడు. ఆసియాలో తొమ్మిది టెస్టులను కోల్పోయామని, ఇప్పుడు విజయం సాధించడమే తమ లక్ష్యమని అన్నాడు. ఆసియాలో ఆడుతున్నప్పుడు, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమన్న విషయం తనకు తెలుసునని చెప్పాడు. నిలకడగా ఆడుతున్న వారు జట్టులో ఎక్కువ మంది ఉన్నందున, భారత్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటామని అన్నాడు.