క్రీడాభూమి

కెప్టెన్సీని విశే్లషించుకోను: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 22: తన కెప్టెన్సీని విశే్లషించుకోవడానికి తగిన సమయం ఇంకా రాలేదని భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభం కానున్న మొదటి టెస్టు కోసం నెట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అతను విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నాయకత్వం గురించి ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందన్నాడు. పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఎక్కువ సమయం కాలేదని, కాబట్టి దీనిపై తాను ఎక్కువగా అలోచించడం లేదని అతను అన్నాడు. కెప్టెన్‌గా పగ్గాలు తీసుకున్న తర్వాతే తన ఆటమరింత మెరుగుపడిందని కోహ్లీ పునరుద్ఘాటించాడు. ప్రతి సిరీస్ ముగిసిన తర్వాత తన గురించి తాను విశే్లషించుకోవడం అంటూ ఎప్పుడూ జరగదని స్పష్టం చేశాడు. విజయాలు సాధించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్న పట్టుదలతోనే సిరీస్‌లను ఆరంభిస్తామని అన్నాడు. నిజానికి కెప్టెన్‌గా తాను సరైన మార్గంలో వెళుతున్నానా? లేదా? అన్నది విశే్లషించుకోవడానికిగానీ, పోల్చి చూసుకోవడానికి ఇది సరైన సమయం కాదన్నాడు. నిలకడగా రాణించడమే కీలకమని, ఇందు కోసం అందరూ కృషి చేయాలని అన్నాడు.
పాఠాలు నేర్చుకుంటా: కెప్టెన్సీ గురించి విశే్లషించుకోకపోయినా, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటునే ఉంటానని కోహ్లీ అన్నాడు. తన దూకుడును ఒక క్రమంలో పెట్టడుతున్నాడని కోచ్ కుంబ్లేను ప్రశంసించాడు. అతని సూచనలు, సలహాలతో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నానని అన్నాడు.

సుమారు ఏడాదిన్నరగా అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న కోహ్లీ గత 13 టెస్టుల్లో 80 సగటుతో 1,457 పరుగులు సాధించాడు. అతని విజృంభణ ఇదే విధంగా కొనసాగితే, ఆస్ట్రేలియా బౌలర్లకు కష్టాలు తప్పవు.