క్రీడాభూమి

రెన్షా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే: ఆస్ట్రేలియా యువ ఓపెనర్ మాట్ రెన్‌షా అంతర్జాతీయ క్రికెట్‌లో తన కంటే ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లకు కూడా పాఠాలు నేర్పే విధంగా పోరాట పటిమను ప్రదర్శించాడు. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అతను 36 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రిటైరయ్యాడు. ఉదర సంబంధమైన సమస్యతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయిన 20 ఏళ్ల రెన్‌షా ఆతర్వాత జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. బంతి విపరీతంగా స్పిన్ అవుతూ, పేసర్ల బౌలింగ్‌లో అనూహ్యంగా బౌన్స్ అవుతూ బ్యాట్స్‌మెన్ సామర్థ్యానికి పరీక్ష పెట్టింది. అయితే, రెన్‌షా ఎంతో అనుభవజ్ఞుడిలా ఆడి, జట్టును ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా పోరాటం సాగించాడు. 156 బంతులు ఎదుర్కొన్న అతను 68 పరుగులు చేశాడు.
భారత్‌లో జరిగిన ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా రెన్‌షా రికార్డు సృష్టించాడు. 1979 అక్టోబర్‌లో జరిగిన కాన్పూర్ టెస్టులో రిక్ డార్లింగ్ 186 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేశాడు. అప్పటికి అతని వయసు 22 సంవత్సరాల 154 రోజులు. రెన్‌షా 20 సంవత్సరాల, 332 రోజుల వయసులో భారత్‌లో టీమిండియాపై హాఫ్ సెంచరీ సాధించి, డార్లింగ్ రికార్డును బద్ధలు చేశాడు.

చిత్రం.. మాట్ రెన్‌షా