క్రీడాభూమి

ఆస్ట్రేలియా చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకు బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వనే్డలో చేదు అనుభవం ఎదురైంది. స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆ జట్టు ఏకంగా 159 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. స్వదేశంలో చెలరేగిపోయిన కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్, హెన్రీ నికోల్స్ అద్భుత బ్యాటింగ్ ప్రతిభ కనబరిస్తే, బౌలింగ్‌లో మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ చెరి మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పరాజయాన్ని శాసించారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా, కివీస్ ఇన్నింగ్స్‌కు గుప్టిల్, మెక్‌కలమ్ శుభారంభాన్ని అందించారు. 10.5 ఓవర్లలో వీరు మొదటి వికెట్‌కు 79 పరుగులు జత చేశారు. మెక్‌కలమ్ 29 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 44 పరుగులు చేసి జేమ్స్ ఫాల్క్‌నెర్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కేన్ విలియమ్‌సన్ పరుగుల ఖాతా తెరవకుండానే జొష్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో షాన్ మార్ష్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని 76 బంతులు ఎదుర్కొన్న గుప్టిల్ ఫోర్లు, సిక్సర్లతో ప్రేక్షకులను అలరించాడు. అతను సాధించిన 90 పరుగుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. సెంచరీకి పది పరుగుల దూరంలో ఉండగా అతను దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. హెన్రీ నికోల్స్ బాధ్యతాయుతంగా ఆడుతూ 67 బంతుల్లో 61 పరుగులు చేసి మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌కు చిక్కాడు. లోయల్ మిడిల్ ఆర్డర్‌లో మిచెల్ సాంట్నర్ 35, టెయిలెండర్ మాట్ హెన్రీ 5 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, గ్రాంట్ ఇలియట్ 21, కొరీ ఆండర్సన్ 10, ల్యూక్ రోన్చీ 16, ఆడం మిల్లే 14 పరుగులు సాధించి వెనుదిరిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజెల్‌వుడ్, ఫాల్క్‌నెర్, మిచెల్ మార్ష్ తలా మూడు వికెట్లు కూల్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిలువునా ముంచేశారు. న్యూజిలాండ్ బౌలింగ్‌ను, ప్రత్యేంచి ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ బంతులను సమర్థంగా ఎదుర్కోలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. షాన్ మార్ష్ (5), డేవిడ్ వార్నర్ (12), స్టీవెన్ స్మిత్ (19), జార్జి బెయిల్ (2), గ్లేన్ మాక్స్‌వెల్ (0), మిచెల్ మార్ష్ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను ఆదుకోవడానికి లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూ వేడ్ (37), ఫాల్క్‌నెర్ (36) కొంత సేపు ప్రయత్నించారు. జాన్ హాస్టింగ్స్ 8, కేన్ రిచర్డ్‌సన్ 19 పరుగులు చేసి అవుట్‌కాగా, ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలే సమయానికి పరుగుల ఖాతా తెరవని హాజెల్‌వుడ్ నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ సాంట్నర్ కేవలం రెండు బంతులు మాత్రమే బౌల్ చేసి, రెండు వికెట్లు పడగొట్టడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 307 (మార్టిన్ గుప్టిల్ 90, బ్రెండన్ మెక్‌కలమ్ 44, హెన్రీ నికోల్స్ 61, మిచెల్ సాంట్నర్ 35 నాటౌట్, జొష్ హాజెల్‌వుడ్ 2/68, జేమ్స్ ఫాల్క్‌నెర్ 2/67, మిచెల్ మార్ష్ 2/35).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 24.2 ఓవర్లలో ఆలౌట్ 148 (మథ్యూ వేడ్ 37, జేమ్స్ ఫాల్క్‌నెర్ 36, ట్రెంట్ బౌల్ట్ 3/38, మాట్ హెన్రీ 3/41, సాంట్నర్ 0/2).

సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కివీస్ బ్యాట్స్‌మన్
మార్టిన్ గుప్టిల్