క్రీడాభూమి

ఉమేష్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమేష్ యాదవ్ మొదటి రోజు ఆటలో 32 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అతను నాలుగు వికెట్లు సాధించడం ఇది రెండోసారి. వెస్టిండీస్‌తో 2011 నవంబర్‌లో కోల్‌కతాలో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను 80 పరుగులకు 4 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్‌ని భారత్ ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఆతర్వాత ఉమేష్ ఒక ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చడం ఇదే మొదటిసారి.
డేవిడ్ వార్నర్‌ను టెస్టుల్లో అవుట్ చేయడం ఉమేష్ యాదవ్‌కు ఇది ఐదోసారి. మొత్తం పది ఇన్నింగ్స్‌లో అతను ఐదుసార్లు వార్నర్‌ను అవుట్ చేశాడు. షాన్ మార్ష్‌ను కూడా ఉమేష్ ఇంత వరకూ ఐదు పర్యాయాలు పెవిలియన్ చేర్చాడు.

పుణే, ఫిబ్రవరి 23: భారత్‌తో గురువారం మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ దాడికి ఆస్ట్రేలియా కకావికలైంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఆత్మరక్షణకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మాట్ రెన్‌షా, మిచెల్ స్టార్క్ కొంత వరకూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసి, అర్ధ శతకాలు సాధించినా, ఆసీస్ గొప్ప స్కోరు చేయలేకపోయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసి, తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఆసీస్ మాజీ సూపర్ స్పిన్నర్ షేన్ వార్న్‌కు స్వర్గ్ధామంగా ఉండేదంటూ రవి శాస్ర్తీ అభివర్ణించిన పుణే పిచ్‌పై, భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ విజృంభించడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పొరపాటు చేశాడని ఉమేష్ నిరూపించాడు. మొదటి రోజు ఆటలో మూడు వందల పరుగుల మైలురాయిని అధిగమించాలన్న ఆసీస్ ఆశ ఫలించలేదు. ఏకంగా తొమ్మిది వికెట్లు కూలడం ఆ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డేవిడ్ వార్నర్‌తో కలిసి ఆరంభించిన మాట్ రెన్‌షా అనారోగ్య కారణంగా రిటైర్‌కాగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ మైదానంలోకి వచ్చాడు. మొత్తం మీద ఆసీస్ ఆట నత్తనడకన సాగింది. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ వికెట్ కూలింది. 77 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసిన అతనిని ఉమేష్ క్లీన్ బౌల్డ్‌చేసి, ఆసీస్‌ను తొలి దెబ్బతీశాడు. షాన్ మార్ష్ 16 పరుగులు చేసి, జయంత్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. పీటర్ హాండ్స్‌కోమ్ కూడా ఎక్కువ సేపు జ్‌ల్రో నిలవలేకపోయాడు. 22 పరుగులు చేసిన అతనిని రవీంద్ర జడేజా ఎల్‌బిగా పెవిలియన్ పంపాడు. అప్పటి వరకూ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ, 95 బంతుల్లో 27 పరుగులు చేసిన స్టీవెన్ స్మిత్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో స్మిత్ ఇన్నింగ్స్ ముగిసింది. మిచెల్ మార్ష్ (4), వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ (8) తమ స్థాయికి తగినట్టు ఆడలేక మైదానాన్ని వీడారు. అనారోగ్యం కారణంగా రిటైరైనప్పటికీ, ఆతర్వాత జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బ్యాటింగ్‌కు వచ్చిన మాట్ రెన్‌షా మొత్తం 156 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 68 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కి చిక్కాడు. మిచెల్ స్టార్క్ (58 బంతుల్లో 57 పరుగులు) అర్ధ శతకాన్ని పూర్తి చేసి, క్రీజ్‌లో ఉండగా, అతనికి తోడు జొష్ హాజెల్‌వుడ్ (1) నాటౌట్‌గా కొనసాగుతున్నాడు. అయితే, అతను గార్డ్ తీసుకోవడానికి ముందు స్టీవ్ ఒకీఫ్, నాథన్ లియాన్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్‌కావడం ఆసీస్‌ను కష్టాల్లో పడేసింది. మొదటి రోజు 94 ఓవర్లు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేయగలిగింది. ఉమేష్ యాదవ్ 32 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు కూల్చారు.

చిత్రాలు..నాలుగు వికెట్లు కూల్చి ఆసీస్‌ను దెబ్బతీసిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్

*ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ను అవుట్ చేసిన
అశ్విన్ (ఎడమ)కు టీమిండియా సారథి కోహ్లీ అభినందన