క్రీడాభూమి

9,000 పరుగుల క్లబ్‌లో డివిలియర్స్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 25: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 9,000 పరుగుల మైలురాయిని అధిగమించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిలియర్స్‌కు చోటు లభించింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన మూడో వనే్డలో 85 పరుగులు చేసిన అతను, దక్షిణాఫ్రికా 159 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. డివిలియర్స్‌తోపాటు క్వింటన్ డికాక్ (68) కూడా అర్ధ శతకం సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలైంది. 32.2 ఓవర్లలో 112 పరుగులకు కుప్పకూలింది. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కొలిన్ డి గ్రాండ్‌హోమ్ అజేయంగా 34 పరుగులు చేసి, జట్టును ఆదుకోవడానికి విఫలయత్నం చేశాడు. కానీ, మిగతా వారి వైఫల్యం కివీస్ ఓటమికి కారణమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మూడో మ్యాచ్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. కాగా, అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల క్లబ్‌లో చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో డివిలియర్స్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అతను 205 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరి, రికార్డు సృష్టించగా, సౌరవ్ గంగూలీ (228 మ్యాచ్‌లు), సచిన్ తెండూల్కర్ (235 మ్యాచ్‌లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

చిత్రం.. ఎబి డివిలియర్స్