క్రీడాభూమి

రెండేళ్లలో ఇదే చెత్త ప్రదర్శన: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 25: తాము ఇంత దారుణంగా విఫలం కావడం సుమారు రెండేళ్ల కాలంలో ఇదే మొదటిసారని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆ స్ట్రేలియాతో మొదటి టెస్టు ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించిందని ప్రశంసిం చాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 13 పరుగులు చేశాడు. ఈ విధంగా రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దిగిన మ్యాచ్‌ల్లో అతని అత్యల్ప స్కోరు ఇదే. ఇంతకు ముందు 2012లో జరిగిన ఈడెన్ గార్డెన్స్ టెస్టులో ఇంగ్లాండ్‌తో ఆడుతూ అతను రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 26 పరుగులు చేశాడు.
కాగా, భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా గత ఏడు టెస్టుల్లో పరాజయాలను చవిచూసింది. ఈ విజయంతో ఊపిరిపీల్చుకుంది. 2004లో నాగపూర్‌లో చివరిసారి భారత్‌ను ఓడించిన తర్వాత, భారత్‌లో ఆస్ట్రేలియా 11 టెస్టులు ఆడింది. వాటిలో ఏడు మ్యాచ్‌లను చేజార్చుకోగా, నాలుగు డ్రా అయ్యాయి. కాగా, ఈ మ్యాచ్‌కి ముందు ఆసియాలో ఆస్ట్రేలియా వరుసగా 9 టెస్టులను కోల్పోయింది. నాలుగు భారత్‌లో, రెండింటిని యుఎఇలో, 3 మ్యాచ్‌లను శ్రీలంకలో చేజార్చుకుంది. ఆ వరుస ఓటములకు ఇప్పుడు తెరపడింది.
భారత జట్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి మొత్తం 212 పరుగులు చేసింది. స్వదేశంలో జరిగిన ఒక టెస్టులో రెండు సార్లు ఆలౌటై టీమిండియా చేసిన అత్యల్ప స్కోరు ఇదే. 1956లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే స్కోరుకు ఆలౌటైంది. మొత్తం మీద రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 272 పరుగులు చేయగలిగింది. రెండు పర్యాయాలు అలౌటైన ఒక టెస్టులో అదే అత్యల్ప స్కోరుగా నమోదుకాగా, ఆ రికార్డును కోహ్లీ బృందం బద్దలు చేసింది! అంతేగాక, రెండు ఇన్నింగ్స్‌ను కలిపి భారత బ్యాట్స్‌మెన్ 74 ఓవర్లు ఆడగలిగారు. 20 వికెట్లు కోల్పోయిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు గతంలో ఎన్నడూ ఇన్ని తక్కువ ఓవర్లకు పరిమితం కాలేదు.