క్రీడాభూమి

మధ్య ప్రదేశ్ 4 వికెట్లకు 254

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలతో రాణించడంతో బెంగాల్‌తో బుధవారం మొదలైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మధ్య ప్రదేశ్ (ఎంపి) నాలుగు వికెట్లకు 254 పరుగులు సాధించింది. ఆదిత్య శ్రీవాత్సవ 65 పరుగులు చేయగా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నమన్ ఓఝా 64 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్పీత్ సింగ్ భాటియా 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒక దశలో 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఎంపికి శ్రీవాత్సవ, నమన్ ఊపిరిపోశారు. వీరు మూడో వికెట్‌కు 102 పరుగులు జోడించడంతో జట్టు కోలుకుంది. బెంగాల్ బౌలర్లలో వీర్‌ప్రతాప్ సింగ్ 55 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.
అఖిల్ సెంచరీ
ముంబయి 6 వికెట్లకు 303
మైసూర్: అఖిల్ హెర్వాద్కర్ శతకంతో రాణించడంతో, జార్ఖండ్‌తో బుధవారం ప్రారంభమైన రంజీ క్వార్టర్ ఫైనల్స్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి ఆరు వికెట్లకు 303 పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి తొలి వికెట్‌ను జై బిస్తా (9) రూపంలో కోల్పోవగా, శ్రేయాస్ అయ్యర్ (45)తో కలిసిన అఖిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతను 107 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 75 పరుగులు చే శాడు. జస్కరన్ సింగ్ 2 వికెట్లు కూల్చాడు.

దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరిన భారత మహిళల హాకీ జట్టు. ఒలింపిక్స్‌కు సిద్ధం కావడమే ఈ టూర్ లక్ష్యం