క్రీడాభూమి

విండీస్ బృందం ప్రకటనపై పిసిబి ఎదురుచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 26: ఇటీవల లాహోర్‌లో పర్యటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) భద్రతాధికారుల బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తమ ఆటగాళ్లు పాకిస్తాన్ పర్యటనకు వెళితే, అక్కడి భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయా లేదా అన్నది ఈ బృందం పరిశీలించింది. అంతేగాక, అక్కడి సర్కారు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతుందనే విషయాన్ని కూడా అధ్యయనం చేసింది. అయతే, పాక్‌లో పర్యటించే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. చాలాకాలంగా దేశంలో క్రికెట్ సిరీస్‌లు జరగనందువల్ల ఆర్థికంగా దెబ్బతిన్న పిసిబి ఇప్పుడు డబ్ల్యుఐసిబి ప్రకటన కోసం కొండంత ఆశతో ఎదురుచూ స్తున్నది. కాగా, తమ దేశంలో రెండు లేదా మూడు టి-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సిందిగా డబ్ల్యుఐసిబిని ఆహ్వానించినట్టు పిసిబి సీనియర్ అధికారి నజామ్ సేథీ ఒక ప్రకటనలో తెలిపాడు. 2015 నుంచి 2023 వరకూ అమల్లో ఉండే ఒప్పందాన్ని డబ్ల్యుఐసిబి అమలు చేయాల్సి ఉందని అతను గుర్తుచేశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తటస్థ వేదికగా చేసుకొని పాక్ జట్టు సిరీస్‌లు ఆడుతున్న విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, స్వదేశంలో సిరీస్‌లను అభిమానులు కోరుకుంటున్నారని తెలిపాడు. ఇలావుంటే, శ్రీలంక క్రికెటర్లు 2009లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు, లాహోర్ గడాఫీ స్టేడియం సమీపంలో వారిపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కెన్యాను మినహాయిస్తే, ఇప్పటి వరకూ ఐసిసి టెస్టు హోదా ఉన్న లేదా అనుబంధ జట్లు ఏవీ పాకిస్తాన్‌లో పర్యటించలేదు. గడాఫీ స్టేడియానికి లంక ఆటగాళ్లను తీసుకెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు మృతి చెందారు. లంక ఆటగాళ్లు అజంతా మేండిస్, తిలన్ సమరవీర, తరంగ పరవితరణ తదితరులు గాయపడ్డారు. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్‌లో సిరీస్‌లను రద్దు చేసుకున్నారు. మిగతా జట్లన్నీ యుఎఇలో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుండగా, భారత్ పూర్తిగా క్రికెట్ సంబంధాలను రద్దు చేసుకుంది. స్వదేశంలో సిరీస్‌లు జరగకపోవడంతో, ఆర్థికంగా చితికిపోయిన పిసిబి ఇప్పుడు ప్రపంచ దేశాలను బతిమిలాడడం మొదలుపెట్టింది. ఏదో ఒక జట్టు ధైర్యం చేసి పాక్‌లో మ్యాచ్‌లు ఆడితే, మిగతా జట్లు కూడా క్యూ కడతాయని పిసిబి ఆశిస్తున్నది. అందుకే, విండీస్ బృందాన్ని లాహోర్ రావాల్సిందిగా ఆహ్వానించింది. అయితే, ఇంతకు ముందు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ క్రికెట్ ప్రతినిధులు పాక్‌కు వెళ్లి, సమీక్షలు జరిపి, సానుకూలంగానే నివేదికలు ఇచ్చినప్పటికీ, ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి అనుమతి లభించలేదు. విండీస్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.