క్రీడాభూమి

హెపటైటిల్ ‘సి’ పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, ఫిబ్రవరి 26: ప్రాణాంతక వ్యాధి హెపటైటిల్ ‘సి’ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ పిలుపునిచ్చాడు. రక్త సంబంధమైన ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఈజిప్టులో చాలా ఎక్కువ. ఇటీవలే అక్కడి ప్రభుత్వం హెపటైటిస్ ‘సి’కి అత్యుత్తమ వైద్య సేవలు అందించడం ఆరంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హెపటైటిల్ ‘సి’ వ్యాధిసోకిన వారు ఎవరైనా ఈజిప్టులో చికిత్స పొందవచ్చని, వేచి ఉండాల్సిన పరిస్థితిగానీ, భారీ ఖర్చులుగానీ లేకుండా సత్వర చికిత్సను అందిస్తామని ప్రకటించింది. ‘టూర్ అండ్ క్యూర్’ అన్న నినాదంతో చేపట్టిన కార్యక్రమానికి మెస్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల కైరోలో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న అతను మాట్లాడుతూ ఈ వ్యాధి పట్ల జాగ్రత్త వహించాలని సూచించాడు.