క్రీడాభూమి

టోర్నీలన్నీ ఒకటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: తన దృష్టిలో టోర్నీలన్నీ ఒకటేనని, ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదని బాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు స్పష్టం చేసింది. వచ్చేనెల ఏడు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న ఆమె ఆదివారం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏ టోర్నీలోనైనా పోటీపడాల్సిన తన ప్రత్యర్థులు దాదాపుగా తనకు కొత్తకాదని, గతంలో పరస్పరం తలపడిన వారే ఉంటారని తెలిపింది. కాబట్టి, అన్ని టోర్నీల మాదిరిగానే ఆల్ ఇంగ్లాండ్‌లోనూ బరిలోకి దిగుతానని 21 ఏళ్ల ఈ హైదరాబాదీ చెప్పింది. తాను అన్ని విధాలా ఆల్ ఇంగ్లాండ్‌కు సిద్ధమవుతున్నానని తెలిపింది. టోర్నీలు ఏవైనా, ప్రతి మ్యాచ్‌నీ కీలకంగానే చూడాల్సి ఉంటుందని అన్నది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన క్రీడాకారిణిగా, రాజీవ్ ఖేల్ రత్న అవార్డును సాధించిన స్టార్‌గా బరిలోకి దిగుతున్నప్పుడు ఏవైనా ఒత్తిళ్లు ఉంటాయా అన్న ప్రశ్నకు లేదని సమాధానమిచ్చింది. ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డి ఆడతానని, ఆల్ ఇంగ్లాండ్‌లోనూ అదే విధంగా పోరాడతానని తెలిపింది. ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ టోర్నమెంట్ తనకు కీలకమైన ప్రాక్టీస్‌కు ఉపయోగపడిందని సింధు తెలిపింది.

చిత్రం..పివి సింధు