క్రీడాభూమి

ధోనీ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 26: జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెంచరీతో కదం తొక్కడంతో, విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ ‘డి’లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 78 పరుగుల తేడాతో చత్తీస్‌గఢ్‌ను చిత్తుచేయగలిగింది. ఓపెనర్ ఆనంద్ సింగ్ తప్ప టాప్ ఆర్డర్‌లో అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితంకాగా, జార్ఖండ్ ఒకానొక దశలో 57 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో షాబాజ్ నదీం (53)తో కలిసి ధోనీ జట్టును ఆదుకున్నాడు. అతను 107 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 129 పరుగులు చేశాడు. జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 243 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ 38.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ ఆరోన్, షాబాజ్ నదీం చెరి మూడు వికెట్లు పడగొట్టారు.
ఇతర మ్యాచ్‌ల్లో, ఢిల్లీని హిమాచల్ ప్రదేశ్ 185 పరుగుల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 339 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ 37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో విదర్భ 22 పరుగుల ఆధిక్యంతో బరోడాను ఓడించింది. 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 5 వికెట్లకు 251 పరుగులు సాధించింది. అనంతరం బరోడాను 42.4 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్ చేసింది. మరో మ్యాచ్‌లో పంజాబ్‌పై అస్సాం మూడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 49.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. అనంతరం అస్సాం 48.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో మధ్య ప్రదేశ్‌ను ఆంధ్ర రెండు వికెట్ల తేడాతో ఓడించింది. మధ్యప్రదేశ్ 40.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్‌కాగా, ఆంధ్ర 37.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 131 పరుగులు చేసి గెలిచింది. కాగా, గోవాపై గుజరాత్ 78 పరుగులు, హర్యానాపై రైల్వేస్ 71 పరుగులు, సౌరాష్టప్రై హైదరాబాద్ 113 పరుగుల తేడాతో విజయాలను నమోదు చేశాయి. సర్వీసెస్‌ను కర్నాటక నాలుగు వికెట్లు, కేరళను మహారాష్ట్ర 122 పరుగులు, రాజస్థాన్‌ను ముంబయి 5 వికెట్లు, ఉత్తర ప్రదేశ్‌ను తమిళనాడు 7 వికెట్ల తేడాతో ఓడించాయి.

చిత్రం..సెంచరీ హీరో మహేంద్ర సింగ్ ధోనీ