క్రీడాభూమి

గోయల్, శివాల్కర్‌కు బిసిసిఐ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అసాధారణ ప్రతిభావంతులుగా పేరు సంపాదించినప్పటికీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన స్పిన్నర్లు రాజీందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్‌ను బిసిసిఐ ఎట్టకేలకు గుర్తించింది. వీరిద్దరికీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద సికె నాయుడు పురస్కారాన్ని అందించనున్నట్టు ప్రకటించింది. మార్చి ఎనిమిదిన బెంగళూరులో జరిగే కార్యక్రమంలో వీరికి అవార్డును ప్రదానం చేస్తారు. వీరితోపాటు భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామికి కూడా సికె నాయుడు అవార్డును బహూకరిస్తారు. రంజీల్లో హర్యానా తరఫున ఆడని గోయల్ తన కెరీర్‌లో 750 వికెట్లు కూల్చాడు. వీటిలో 637 రంజీల్లో సాధించినవే. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రంజీల్లో గోయల్ సృష్టించిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. కాగా, ముంబయి జట్టుకు ఆడిన శివాల్కర్ కెరీర్‌లో 124 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 589 వికెట్లు కూల్చాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను 42 పర్యాయాలు పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో పది వికెట్లను 13 సార్లు సాధించాడు. వీరిద్దరూ తిరుగులేని స్పిన్నర్లుగా అభిమానుల జేజేలు అందుకున్నప్పటికీ, బిషన్ సింగ్ బేడీ సమకాలీనులు కావడంతో జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు.

చిత్రం..లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కింద బిసిసిఐ నుంచి సికె నాయుడు అవార్డును స్వీకరించనున్న మాజీ స్పిన్నర్లు రాజీందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్